Ranveer Allahbadia: రణ్‌వీర్ అల్హాబాదియాకు సుప్రీం బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:48 PM
గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు.

న్యూఢిల్లీ: 'ఇండియాస్ గాట్ లాటెంట్' వేదికగా వివాదాస్పద వ్యాఖ్యల్లో చిక్కుకున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. ఆయన పాస్‌పోర్ట్‌ను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు ఆదేశించింది. గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేస్తూ, పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేయాల్సిందిగా మహారాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరోకు దరఖాస్తు చేసుకునేందుకు అల్హాబాదియాకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన తన షోల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..
అల్హాబాదియాపై దర్యాప్తు పూర్తయినట్టు అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో ఆయనకు ఉపశమనం లభించింది. అల్హాబాదియాపై పలు చోట్ల నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఒకేచోటకు చేర్చాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తదుపరి విచారణలో పరిశీలిస్తామని కూడా న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎ.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.
అల్హాబాదియా కొద్దికాలం క్రితం సమయ్ రైనా షోలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను సమర్ధించుకోవాలనుకోవడం లేదని, తనను క్షమించాలని అల్హాబాదియా కోరారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News