Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:38 PM
Supreme Court: సోషల్ మీడియాతోపాటు ఓటీటీ చానెల్స్‌లో లైంగిక అసభ్యకమైన కంటెంట్ ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిని నియంత్రించాలంటూ పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఓటీటీ, సోషల్ మీడియాలో లైంగిక, అసభ్యకరమైన కంటెంట్ ప్రసారాన్ని నియంత్రించేలా వాటిపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పలు అంశాలను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాషితో కూడిన ధర్మాసనం లేవనెత్తింది.
ఆ క్రమంలో ఈ అంశం కార్యనిర్వాహక, శాసన సభ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు తాము శాసన, కార్యనిర్వాహాక అధికారంలో జోక్యం చేసుకొంటున్నామనే ఆరోపణలు ఉన్నాయంటూ జస్టిస్ బి.ఆర్. గవాయి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఈ అంశంపై స్పందించాలంటూ కేంద్రంతోపాటు నెటిఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్,యూట్యూబ్‌లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 ప్రకారం కొన్ని నియంత్రణ యంత్రాంగాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకు వెళ్లారు. ఇక అదనపు నిబంధనలు పరిశీలనలో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు సోషల్ మీడియాతోపాటు ఓటీటీలో లైంగిక అసభ్యకమై కంటెంట్ ప్రసారమవుతోందంటూ ఐదుగురు పిటిషనర్లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదన వినిపించారు.
అంతేకాకుండా వీటిలో ప్రసారమవుతోన్న కంటెంట్‌ను పర్యవేక్షించడంతోపాటు నియంత్రించడానికి జాతీయ కంటెంట్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు.. తమ పిటిషన్‌లో స్ఫష్టం చేశారు. అయితే ఈ పిటిషిన్‌పై తదుపరి విచారణ ఎప్పుడనేది సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు. కేంద్రం ప్రతిస్పందన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..
Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
For National News And Telugu News