Share News

Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... విమానప్రమాదంలో మృత్యుంజయుడు

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:08 PM

విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.

Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... విమానప్రమాదంలో మృత్యుంజయుడు
Air crash, Vishwash Kumar Ramesh

అహ్మదాబాద్: యావద్దేశాన్ని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషాదంలో ముంచెత్తింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఏఐ-171 విమానం కుప్పకూలడంతో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. జరిగిందేమిటో తెలుసుకునే లోపే అందరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపడి మృత్యుంజయుడుగా నిలిచారు. ఆ భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.


విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రమాదవశాత్తూ ఓ భవనంపై విమానం కూలి పేలిపోయిందని, సెకండ్లలోనే అంతా జరిగిపోయిందని తెలిపారు. తన సీటు సమీపంలో భారీ డ్యామేజ్ జరిగింది. 'మొదట నేను చనిపోయానని అనుకున్నా. ఆ తర్వాత నేను బతికున్నట్టు గ్రహించా. విమాన శకలాల నుంచి పాకుకుంటూ బయటపడ్డా. నా చుట్టూ ఉన్న వారు కొంతమంది చనిపోగా.. మరికొంతమంది చావుబతుకుల మధ్య ఉన్నట్లు కనిపించింది' అని చెప్పారు. మరోవైపు విమానం నుంచి బయటపడగానే విమానం పేలిపోయిందని అరుస్తూ విశ్వాస్ బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రమేష్‌ను కలిసిన మోదీ

అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన రమేష్‌ను సైతం కలిశారు మోదీ. ప్రమాదం నుంచి తానేలా బయటపడ్డానో ప్రధానికి బాధితుడు వివరించాడు. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించిన మోదీ.. ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందని, అధికారులు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ప్రధాని మోదీ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 05:04 PM