Share News

NIA Inquiry: సిరాజ్‌కు 10 బ్యాంకు ఖాతాలు

ABN , Publish Date - May 21 , 2025 | 08:12 AM

విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభూతి కలిగిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ మరియు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌ పై ఎన్‌ఐఏ అధికారులు ఆర్థిక మూలాలు, బ్యాంకు ఖాతాలు, కాల్‌ డేటా తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్‌కి 10 బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు సమాచారం, మరియు ఆయన ఆర్థిక లావాదేవీలను విశ్లేషించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 NIA Inquiry: సిరాజ్‌కు 10 బ్యాంకు ఖాతాలు

  • కాల్‌ డేటాపైనా ఎన్‌ఐఏ ఆరా

విజయనగరం, మే 20(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద సానుభూతిపరులైన విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌, హైదరాబాద్‌కు చెందిన్‌ సయ్యద్‌ సమీర్‌ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక మూలాలను శోధిస్తున్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌కు 10 బ్యాంక్‌ అకౌంట్‌లు ఉన్నట్లు సమాచారం. వీటిలో విజయనగరంలోని డీసీసీబీ ఖాతా, అతని తండ్రి పేరుపై ఉన్న లాకర్‌ గురించి పోలీసులు ఇప్పటికే ఆరా తీశారు. ఎన్‌ఐఏ అధికారులు రెండు రోజులుగా విజయనగరంలోనే ఉంటూ విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆరా తీస్తూ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. సిరాజ్‌ సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, అతని బ్యాంక్‌ ఖాతాల లావాదేవీలు, సెల్‌ఫోన్‌ నంబర్ల వినియోగం, కాల్‌డేటా తదితర విషయాలను మంగళవారం నమోదు చేసుకున్నారు. సిరాజ్‌ కుటుంబం నివాసం ఉండే ఆబాద్‌వీధి, సిరాజ్‌ ప్రత్యేకంగా ఉంటున్న బాబామెట్టలోని ఆయన ఇంటిని మరోసారి పరిశీలించినట్లు సమాచారం. అలాగే సయ్యద్‌ సమీర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆర్థిక లావాదేవీలు, మొబైల్‌ కాంటాక్ట్‌ నంబర్లపై ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. కాగా, సిరాజ్‌, సమీర్‌ల నుంచి సమాచారం రాబట్టేందుకు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - May 21 , 2025 | 08:12 AM