Share News

NASA: నేడే శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

ABN , Publish Date - Jun 25 , 2025 | 06:40 AM

ఇప్పటికి ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) పయనం కానున్నారని నాసా మంగళవారం వెల్లడించింది.

NASA: నేడే శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

  • మధ్యాహ్నం 12:01 గంటలకు ప్రయోగం

న్యూడిల్లీ, జూన్‌ 24: ఇప్పటికి ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) పయనం కానున్నారని నాసా మంగళవారం వెల్లడించింది. చివరిసారిగా ఈ నెల 22న యాక్సియం-4 మిషన్‌ ఉంటుందని ప్రకటించిన నాసా.. ప్రయోగానికి రెండు రోజుల ముందు వాయిదా వేసింది. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం బుధవారం (25న) మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది.


ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో ఉన్న లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. నలుగురితో కూడిన స్పేస్‌ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లనుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఈ వ్యోమనౌక ఐఎ్‌సఎ్‌సతో డాకింగ్‌ అవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజులపాటు ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29నే జరగాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడింది.

Updated Date - Jun 25 , 2025 | 06:40 AM