Operation Mahadev: తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి.. పహల్గాం ఉగ్రవాదులకు పట్టిన గతిపై అమిత్‌షా
ABN , Publish Date - Jul 30 , 2025 | 08:58 PM
పహల్గాం ముష్కరులు ఎక్కడ కనిపించినా తలలోంచి బుల్లెట్లు దింపాలని దేశంలోని అనేక మంది నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయని, యాదృచ్ఛికంగా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల తలల్లోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడులో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను 'ఆపరేషన్ మహదేవ్' (Operation Mahadev)లో బలగాలు మట్టుబెట్టాయని, ముగ్గురి తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రాజ్యసభకు తెలిపారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండవరోజైన బుధవారంనాడు రాజ్యసభలో జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడారు.
'పహల్గాం ఘటన జరిగిన నెల రోజుల తర్వాత టెర్రరిస్టుల ఉనికి గురించిన సమాజం మాకు అందింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ వెంటనే వారి ఐడెంటినీని ధ్రువీకరించుకుని, జూలై 22 నాటికి వారి వైర్‌లెస్ సెట్‌ల ట్రాకింగ్ పూర్తిచేశాయి. ఉగ్రవాదులు ఎక్కడున్నారనే నిర్దిష్ట లొకేషన్‌ను గుర్తించాయి' అని అమిత్‌షా రాజ్యసభకు తెలిపారు.
పహల్గాం ముష్కరులు ఎక్కడ కనిపించినా తలలోంచి బుల్లెట్లు దింపాలని దేశంలోని అనేక మంది నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయని, యాదృచ్ఛికంగా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల తలల్లోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు.
రెండ్రోజులక్రితం కాంగ్రెస్ నేత పి.చిదంబరం తన రాజీనామాకు డిమాండ్ చేశారని, పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ నిర్వహించినప్పటికీ టెర్రరిస్టులు పాకిస్థాన్ వాళ్లేననడానికి ఆధారాలు ఏమిటని ఆయన అడిగారని అమిత్‌షా గుర్తు చేశారు. ఎవరిని మీరు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు? పాకిస్థాన్‌నా? లష్కరే తొయిబానా? ఇది సిగ్గుగా అనిపించడడం లేదా? అని ప్రశ్నించారు. ఆపరేషన్ మహదేవ్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన రోజే ఆయన ఈ ప్రశ్న వేశారని తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే మతం అడిగి.. తలకు తుపాకీ గురిపెట్టి అత్యంత కిరాతకంగా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో యావద్దేశం అట్టుడికిపోవడంతో భారత్ విజయవంతంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్‌లో 9 ఉగ్రవాద స్థావరాలు, పలు ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది.100 మందికి పైగా కరడుకట్టిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేసింది.
ఇవి కూడా చదవండి..
అమిత్‌షా ప్రసంగం.. పీఎం రాలేదంటూ విపక్షాలు వాకౌట్
అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి