Share News

Delhi Blast Case: ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కేసు నిందితులు

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:46 PM

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన టెర్రరిస్ట్ ఉమర్‌కు అవసరమైన లాజిస్టిక్స్‌ను షోయబ్ అందించిట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్శిటీలో ల్యాబ్ అసిస్టెంగ్‌గా షోయబ్ పనిచేశాడని, ల్యాబ్ నుంచి కెమికల్స్‌ను సేకరించేందుకు ఉమర్‌కు అతను సహకరించాడని అధికారులు చెబుతున్నారు.

Delhi Blast Case: ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కేసు నిందితులు
Delhi Blast case

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10వ తేదీ సాయంత్రం జరిగిన భారీ పేలుడు కేసులో నిందితులు ఆమిర్ (Amir), షోయబ్ (Shoaib)లను పాటియాలా హౌస్ కోర్టు ముందు ఎన్ఐఏ (NIA) బుధవారంనాడు హాజరు పరిచింది. షోయబ్‌ను 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అప్పగించగా, ఆమిర్‌కు ఏడు రోజుల రిమాండ్ విధించింది. షోయబ్‌ను ఎన్ఐఏ ఈరోజు ఉదయం అరెస్టు చేయగా, ఆమిర్‌కు ఇంతకుముందు విధించిన 10 రోజుల రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు.


ఢిల్లీ పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన టెర్రరిస్ట్ ఉమర్‌కు అవసరమైన లాజిస్టిక్స్‌ను షోయబ్ అందించిట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్శిటీలో ల్యాబ్ అసిస్టెంగ్‌గా షోయబ్ పనిచేశాడని, ల్యాబ్ నుంచి కెమికల్స్‌ను సేకరించేందుకు ఉమర్‌కు అతను సహకరించాడని అధికారులు చెబుతున్నారు. ఫరీదాబాద్‌లోని దౌజ్‌ ప్రాంతంలో షోయబ్ నివసిస్తున్నాడని, పేలుడు ఘటనకు ముందు ఒక అద్దెగదిని కూడా ఉమర్‌కు అతను ఏర్పాటు చేశాడని అంటున్నారు. ఉమర్ అక్కడే పేలుడు పదార్ధాలను దాచి పెట్టి ఆ తర్వాత వాటిని ఐ20 కారులో ఫిరోజ్‌పూర్ ఝిర్కాకు తీసుకెళ్లాడని, ఒక ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుని బదర్‌పూర్ మీదుగా ఢిల్లీలోకి అడుగుపెట్టి ఎర్రకోటకు చేరుకున్నాడని చెబుతున్నారు.


కాగా, నవంబర్ 16న హర్యానా ఎస్‌టీఎఫ్ ఉమర్ తలదాచుకున్న గదిని తనిఖీ చేసి దానికి సీల్ వేసింది. కొద్దిరోజులుగా షోయబ్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారికంగా బుధవారంనాడు అతన్ని అరెస్టు చేసింది.


ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

టీ షర్టు వివాదంలో కునాల్ కమ్రా.. బీజేపీ, శివసేన వార్నింగ్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 26 , 2025 | 06:55 PM