Shashi Tharoor: సీఎం పదవి సరే.. ముందు ఏ పార్టీయో తేల్చుకోండి
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:06 AM
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం క్రమేణా బహిర్గతమవుతోంది.

శశి థరూర్‌పై కేరళ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 11: తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం క్రమేణా బహిర్గతమవుతోంది. ఆయన ఇటీవల కాలంలో ప్రధాని మోదీని పొగుడుతుండాన్ని తప్పుపడుతున్న కేరళ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనేదానిపై సర్వే జరిపినప్పుడు 28.3 మంది థరూర్ పేరును సూచించారు.
ఈ విషయాన్ని బుధవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధరన్ స్పందిస్తూ సీఎం పదవి మాట ఎలా ఉన్నప్పటికీ తొలుత ఆయన ఏ పార్టీకి చెందిన వారో తేల్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సర్వేలో ఎవరు ముందున్నా యూడీఎఫ్ గెలిస్తే ఆ కూటమి అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.