Pahalgaam Terror Attack : ఫొటోలు, వీడియోలు షేర్ చేయమని కోరిన ఎన్ఐఏ
ABN , Publish Date - May 07 , 2025 | 08:55 PM
ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇందుకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు కాల్చిచంపడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రేమయం ఉందని కేంద్రం పలు సాక్ష్యాలు సేకరించడంతో పాటు పాక్‌పై కఠిన ఆంక్షలు విధించింది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడి చేసి సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
Operation Sindoor: పాక్ ప్రతిదాడి చేయెచ్చు, అప్రమత్తంగా ఉండాలి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్
ఫోన్ నెంబర్లు విడుదల చేసిన ఎన్ఐఏ
ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది. ఏజెన్సీ కాంటాక్ట్ నెంబర్లు... 9654958816ను కానీ ల్యాండ్ లైన్ నెంబర్ 011-24368800ను కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. కాలర్ల సమాచారాన్ని సీనియర్ ఎన్ఐఏ అధికారి తీసుకుంటారని, కాలర్ల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారని తెలిపింది.
కాగా, ఎన్ఐఏ ఇప్పటికే తమ దర్యాప్తులో భాగంగా దాడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దాడికి సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు, వీడియోలను సమీక్షించే ఆలోచనలో కూడా ఎన్ఐఏ ఉంది. ఎన్ఐఏ టీమ్ పహల్గాంలోనే ఉంటూ దాడి జరిగిన ప్రాంతంలో లభించిన సాక్ష్యాలను విశ్లేషిస్తోంది. ప్రత్యక్ష సాక్షులను సంప్రదించి వివరాలు తెలుసుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: వ్యోమికా, ఖురేషీ గురించి ఈ విషయాలు తెలుసా
Operation Sindoor: భారత్ సైనిక దాడులపై పాక్ రక్షణ మంత్రి ఏమన్నారంటే
ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా