Share News

Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 05 , 2025 | 03:22 PM

కొండ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. టూరిస్ట్ సేఫ్టీ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.

Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: హహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన నేపథ్యంలో టూరిస్టులకు మరింత భద్రత పెంచాలని కోరుతూ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కొట్టివేసింది. పిటిషనర్‌పై ధర్మాసనం మండిపడింది. ప్రజల పట్ల నిజమైన ఆందోళన ఏదీ ఇందులో కనిపించడం లేదని, పబ్లిసిటీ పొందేందుకు ఈ పిటిషన్ వేసినట్టుగా ఉందని కోర్టు మందలించింది. న్యాయపరమైన జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది.

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు


కొండ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలను ఆదేశించాలని ఈ పిల్‌లో సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. టూరిస్ట్ సేఫ్టీ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా కొండ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో అత్వవసర పరిస్థితుల్లో కచ్చితమైన మెడికల్ ఎయిడ్‌కు జోక్యం చేసుకోవాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.


దీనిపై న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌ స్పందిస్తూ, పిటిషనర్ పదేపదే 'పిల్స్' వేయడాన్ని తప్పుపట్టారు. కేవలం ప్రచారం కోసమే ఇదంతా జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు. ''మీరు పదేపదే పిల్స్ వేస్తున్నారు? ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారు? అని బెంచ్ ప్రశ్నించింది. ఇందులో టూరిస్టుల భద్రత తప్పిస్తే ఎలాంటి ఉద్దేశాలు లేవని పిటిషనర్ బదులిచ్చారు. ''ఇది చాలా సున్నితమైన అంశమని మీరు గ్రహించినట్టు లేదు. ఏదో రూపంలో పిటిషన్లు వేసి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం మినహా పబ్లిక్ కాజ్ ఏమీ ఇందులో కనిపించడం లేదు. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నాం'' అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 03:25 PM