Share News

Jama Masjid: మసీదు చుట్టూ టార్పాలిన్ షీట్లు..ఎక్కడంటే?

ABN , Publish Date - Mar 12 , 2025 | 08:14 PM

హోలీ పండుగ రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించి జామా మసీదు చుట్టూ పరదాలు కట్టారు. రంజాన్ మాసం శుక్రవారంనాడే హోలీ పండుగ రావడంతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Jama Masjid: మసీదు చుట్టూ టార్పాలిన్ షీట్లు..ఎక్కడంటే?

సంభాల్: హోలీ, రంజాన్ పండుగల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా జామా మసీదు చుట్టూ టార్పాలిన్ షీట్లు కట్టారు. హోలీ పండుగ రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించి ఈ చర్యలు తీసుకున్నారు. రంజాన్ మాసం శుక్రవారంనాడే హోలీ పండుగ రావడంతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గత ఏడాది జామా మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలివ్వడం, సర్వేకు అధికారులు వెళ్లినప్పుడు పెద్దఎత్తున హింసాకాండ జరగడం, పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంది.

Yogi Adityanath: ఇస్లాం పుట్టక ముందే సంభాల్ ఉంది


సంభాల్‌లో హోలి పండుగ శుక్రవారంనాడు జరగాల్సి ఉండగా, అధికారికంగా రంగ్‌బరి ఏకాదశితో ఐదురోజులకు ముందే ఈ వేడకలు మొదలయ్యాయి. కాగా హోలి ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సంభాల్ డీఎం రాజేంద్ర పెన్సియా మాట్లాడుతూ, హోలి జాతరల ఊరేగింపు శుక్రవారం జరుగుతుందని, 16 జాతరలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. ప్రతి ప్రాంతం, గ్రామంలో శాంతి కమిటీ సమావేశాలు జరిపామని, జిల్లా స్థాయిలో రెండు కమిటీ సమావేశాలు జరిపామని చెప్పారు.


''హోలి పండుగ, ఊరేగింపు సందర్భంగా 27 తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేశాం. ఆరు జోన్లు, 29 సెక్టార్లుగా విభజించి ప్రతి చోట మెజిస్ట్రేట్లు, పోలీసులను మోహరిస్తున్నాం. కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్ జరపాలని ప్రతి పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్ఓలకు ఆదేశాలిచ్చాం. పీఏసీ బెటాలియన్లు బరిలోకి దింపాం. 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీల సహకారంతో 10000 నుంచి 150 అదనపు సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్సతో సర్వేలు, డీజీఐ నేతృత్వంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాం'' అని వివరించారు.


ఇవి కూడా చదవండి..

Udayanidhi: పిల్లల్ని కనండి కానీ...ఉదయనిధి నోట అదేమాట.

Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..

Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2025 | 08:14 PM