Saif meets auto driver: తనను కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీ ఖాన్.. ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jan 22 , 2025 | 04:05 PM
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అతడి ఆరోగ్యం కుదుటపడడంతో మంగళవారం డిశ్ఛార్జ్ అయ్యాడు. అంత పెద్ద దాడి నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అతడి ఆరోగ్యం కుదుటపడడంతో మంగళవారం డిశ్ఛార్జ్ అయ్యాడు. అంత పెద్ద దాడి నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు (Attack on Saif). ముంబై (Mumbai)లోని బాంద్రాలో సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ చోరీకి ప్రయత్నించాడు. అతడ్ని ప్రతిఘటించేందుకు సైఫ్ ప్రయత్నించాడు (Saif meets auto driver).
దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల కారణంగా సైఫ్ గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి తక్షణమే పారిపోయాడు. ఆ వెంటనే సైఫ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో కార్లు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం ఓ ఆటోలో సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో సైఫ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రానా (Auto Driver). ఆ సమయంలో తన ఆటో ఎక్కింది సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి అతడికి తెలియదు. హాస్పిటల్‌లో దిగిన తర్వాతే అతడికి తన ఆటో ఎక్కింది సైఫ్ అనే సంగతి తెలిసిందే. దాంతో ఆటో ఛార్జీ కూడా తీసుకోకుండా భజన్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తనను కాపాడిన ఆటో డ్రైవర్‌ను సైఫ్ అలీఖాన్ స్వయంగా కలిశాడు. మంగళవారం డిశ్ఛార్జ్ అవుతున్న సమయంలో లీలావతి ఆస్పత్రిలోనే ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను సైఫ్ కలిశాడు. ఐదు నిమిషాల పాటు అతడితో మాట్లాడాడు. అతడిని కౌగిలించుకుని ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, సకాలంలో స్పందించిన భజన్ సింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ భజన్ సింగ్‌కు శాలువా కప్పి రూ.11 వేల నగదు బహుమతి అందించి సత్కరించింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..