Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి రూ.15 వేల కోట్ల ఆస్తి నష్టం.. శత్రువుల ఆస్తికి ఓనర్ కాలేరని..
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:04 PM
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు (Saif Ali Khan) చట్టపరంగా పెద్ద షాక్ తగిలింది. భోపాల్‌లోని పటౌడి కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను శత్రువుల ఆస్తిగా మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. గత 25 ఏళ్ల ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

మధ్యప్రదేశ్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ప్రస్తుతం శత్రువు ఆస్తి చట్టం కారణంగా హాట్ టాపిక్‌గా నిలిచారు. భారతదేశం, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగా లేని సమయంలో అనేక మంది భారతదేశం విడిచిపెట్టి పాకిస్థాన్ పౌరసత్వం తీసుకున్న సమయంలో ఈ చట్టం రూపొందించారు. భారతదేశంలో అలాంటి వ్యక్తులకు ఏదైనా ఆస్తి ఉంటే, ప్రభుత్వం దానిని శత్రువు ఆస్తిగా పరిగణించింది. ఇప్పుడు ఈ చట్టం సైఫ్ అలీ ఖాన్‌కు సమస్యలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు (Bhopal High Court).. ట్రయల్ కోర్టు పాత ఉత్తర్వును రద్దు చేసింది.
పూర్వీకుల ఆస్తి..
ఈ నేపథ్యంలో భోపాల్‌లోని సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఆస్తులను శత్రు ఆస్తిగా ప్రకటించింది కోర్టు. ఈ కారణంగా వారి రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తిపై హక్కులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఈ మొత్తం కేసును మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది. భోపాల్లో సైఫ్ (Saif Ali Khan) నానమ్మ సాజిదా సూల్తాన్ నుంచి కొన్ని విలాసవంతమైన భవనాలు సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వచ్చాయి. పూర్వీకుల ఇంటికి సంబంధించిన ఆస్తి.. ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. అతని తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ బంధువులు కొందరు పాకిస్థాన్ వెళ్లారు. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తిని శత్రు ఆస్తిగా పరిగణించింది.
శత్రు ఆస్తి చట్టం అంటే ఏంటి
ఈ చట్టం 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టబడింది. దీని కింద, భారతదేశం నుంచి బయలుదేరి పాకిస్థాన్ లేదా చైనాకు వెళ్లిన వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. 1965, 1971 యుద్ధాల తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య జరిగిన తాష్కెంట్ ప్రకటనలో రెండు దేశాలు ఒకరికొకరు జప్తు చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాయని అంగీకరించారు. కానీ 1971లో పాకిస్థాన్ ఈ ఆస్తులను నాశనం చేసింది. ఆ తర్వాత భారతదేశం కూడా ఈ ఆస్తులను తన నియంత్రణలో ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. అటువంటి ఆస్తులను శత్రువు ఆస్తి అని పిలుస్తున్నారు. ఈ ఆస్తులను ఇప్పుడు ఎవరూ క్లెయిమ్ చేయలేరు.
చట్టాలు కఠినం
ప్రభుత్వం 2017లో ఒక సవరణ చేసి ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. దీని తర్వాత, అటువంటి కేసులలో కోర్టులలో పెద్దగా ఉపశమనం లభించలేదు. అంటే, వారసుడు ఉన్నప్పటికీ, వారు పాకిస్థాన్ లేదా చైనాకు వెళ్లిన వ్యక్తికి బంధువు అయినప్పటికీ, వారి ఆస్తికి యజమాని కాలేరు. ఈ కారణంగా సైఫ్ విషయంలో కూడా సమస్య తలెత్తింది.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి