Share News

Saif Ali Case: సైఫ్ నిందితుడితో వెళ్తున్న పోలీసు వాహనం రోడ్డుపైనే మొరాయించిన వైనం

ABN , Publish Date - Jan 29 , 2025 | 03:46 PM

సైఫ్‌పై దాడి కేసు నిందితుడు షరీఫుల్‌ను కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అతన్ని తీసుకువస్తున్న వాహనం పోలీసు స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో రోడ్డుపైనే ఆగిపోయింది.

Saif Ali Case: సైఫ్ నిందితుడితో వెళ్తున్న పోలీసు వాహనం రోడ్డుపైనే మొరాయించిన వైనం

ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ (Saif Alikhan) పై కత్తితో దాడిచేసిన నిందితుడు షరీఫుల్ ఇస్లామ్‌ (Shariful Islam)ను ముంబైలోని బాంద్ర మెట్రోపాలిటన్ కోర్టులో బుధవారం ఉదయం హాజరుపరిచారు. పోలీసు రిమాండ్ ముగియడంతో అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, షరీఫుల్‌ను కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అతన్ని తీసుకువస్తున్న వాహనం పోలీసు స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు వెనుకనుంచి ఆ వాహనాన్ని ముందుకు నెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అది స్టార్ట్ కాకపోవడంతో నిందితుడిని మరో పోలీసు కారులో ఎక్కించి కోర్టుకు తీసుకువెళ్లారు.

PM Modi: నేను తాగుతున్న నీళ్లు కూడా అవే... ఆప్‌పై మోదీ నిప్పులు


14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

కాగా, నిందితుడు షరీఫుల్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన కొద్ది గంటలకే షరీఫుల్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు చాకచక్యంగా అదుపులోనికి తీసుకున్నారు. ఇంతవరకూ జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం, నిందితుడు ఒంటరిగానే సైఫ్ ఇంటిపై దాడి చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. ఇంతవరకూ వేరే వ్యక్తి ప్రమేయమున్నట్టు వెల్లడికాలేదు. ముంబై పోలీసులు ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక మహిళను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. షరీఫుల్ బంగ్లాదేశ్ వాసి అని, చట్టవిరుద్ధంగా భారత్‌లోకి అడుగుపెట్టి ఐదారు నెలల క్రితమే ముంబై వచ్చాడని, దీనికి ముందు కోల్‌కతాలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. షరీఫుల్ విచారణలో అతను ఉపయోగించిన సిమ్ ఒక మహిళ పేరుతో ఉన్నట్టు గుర్తించారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 03:59 PM