Viral Video: యువతుల నృత్యానికి మంత్రి చప్పట్లు.. వైరల్ వీడియో
ABN , Publish Date - Nov 28 , 2025 | 07:20 PM
తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతి భద్రతలు వైఫల్యం, అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని, అయితే ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రులందరూ ఇలాంటి వినోదాల్లో తేలుతుండటం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే (DMK) ఇరుకున పడింది. ఆ పార్టీ మంత్రి ఎస్.పెరియకరుప్పన్ (S Periyakaruppan)కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. శివగంగ జిల్లాలో జరిగిన ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో కొందరు యువతులు నృత్య ప్రదర్శన చేశారు. మంత్రి ముందు యువతుల డాన్స్ చేస్తుండగా ఆయన ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో మంత్రి నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మహిళలను తన ముందు డాన్స్ చేయమని మంత్రి ఆదేశించడం ద్వారా మహిళల గౌరవాన్ని, తమిళ సంస్కృతిని కించపరచారని ప్రతిపక్ష బీజేపీ తప్పుపట్టింది. తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతి భద్రతలు వైఫల్యం, అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని, అయితే ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రులందరూ ఇలాంటి వినోదాల్లో తేలుతుండటం సిగ్గుచేటని విమర్శించింది.
డీఎంకే స్పందన
మహిళలను తన ముందు డాన్స్ చేయమని మంత్రి ఆదేశించారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను డీఎంకే వర్గాలు తోసిపుచ్చాయి. వైదికపై నుంచి మహిళలు తమంత తాముగా కిందకు వచ్చి మంత్రి ముందు డాన్స్ చేశారని, అన్నాడీఎంకే సైతం గతంలో ఇలాంటి నృత్యాలు నిర్వహించిందని తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.