Rekha Gupta: సీఎం బంగ్లా పునరుద్ధరణ టెండర్ రద్దు
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:59 PM
ముఖ్యమంత్రి రేఖాగుప్తా గత ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జూన్‌లో ఆమెకు రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నెంబర్ 1 కేటాయించారు. మరో బంగ్లా (బంగ్లా నెంబర్ 2) కూడా ఆమెకు కేటాయించారు. అయితే అది క్యాంప్ ఆఫీసుగా ఉపయోగపడనుంది.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) అధికార బంగ్లాలో ఎలక్ట్రికల్ పనుల కోసం జారీ చేసిన టెండర్‌ను పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. అడ్మినిస్ట్రేషన్ కారణాల రీత్యానే టెండర్‌ను రద్దు చేసినట్టు తెలిపింది.
సుమారు రూ.60 లక్షల విలువైన టెంబర్‌ను జూలై 4న ప్రజా పనుల శాఖ జారీచేసింది. అయితే మూడు రోజుల తర్వాత దీనిని రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది. ముఖ్యమంత్రి రేఖాగుప్తా గత ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జూన్‌లో ఆమెకు రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నెంబర్ 1 కేటాయించారు. మరో బంగ్లా (బంగ్లా నెంబర్ 2) కూడా ఆమెకు కేటాయించారు. అయితే అది క్యాంప్ ఆఫీసుగా ఉపయోగపడనుంది. బంగ్లా నెంబర్-1 పునరుద్ధరణ పనుల కోసమే ప్రజా పనుల శాఖ టెంబర్ జారీ చేసింది. తాజాగా దానిని రద్దు చేసింది.
విమర్శల నేపథ్యంలో..
సీఎం నివాసం పునరుద్ధరణ కోసం రూ.60 లక్షలు విలువచేసే టెండర్ జారీపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. గుప్తా 'మాయా/రంగ్‌మహల్' కోసం బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం పెద్ద ఎత్తున దుబారా చేస్తోందని ఆరోపించింది. అయితే సీఎం బంగ్లా పునరుద్ధరణ కోసం టెండర్ పిలవడాన్ని బీజేపీ సమర్ధించింది. ఇవేవీ లగ్జరీ కోసం చేపడుతున్న పనులు కావనీ, రొటీన్ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించినవని పేర్కొంది.
ఇవి కూాడా చదవండి..
సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే
జస్టిస్ వర్మ అభిశంసనపై సంతకాలు షురూ.!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి