Red Fort blast: ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:39 PM
ఎర్రకోట పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాఫ్తు సంస్థ తాజాగా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్ లాట్‌లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసును జాతీయ దర్యాఫ్తు సంస్థ (NIA) ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పేలుడుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. తాజాగా మరో కీలక అంశాన్ని కూడా బయటపెట్టింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్ లాట్‌లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది (Red Fort blast probe).
రెడ్ ఫోర్ట్ కార్ పార్కింగ్‌లోనే ఉమర్ మహమ్మద్ ఆ బాంబును అసెంబుల్ చేసినట్టు సమాచారం. కారులో కూర్చుని మూడు గంటల పాటు బాంబును రెడీ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాడికి ముందు పేలుడు స్థలంలో రెక్కీ చేసినట్టు సీసీటీవీల ద్వారా కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం. అంతకు ముందు ఢిల్లీలోని ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే విషయంపై ఉమర్ తన సహచరులతో చాలా సేపు చర్చించాడని, అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్‌మార్గ్‌లో పేలుడు నిర్వహించాలని వారు ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు (Umar Delhi blast).
పార్కింగ్ లాట్‌లో కారులో ఉన్న మూడు గంటల సమయంలో ఒక్కసారి కూడా ఉమర్ కిందకు దిగలేదని, పేలుడు పదార్థాలను తయారు చేస్తూ కారులోనే ఉండిపోయాడని సీసీటీవీల ద్వారా బయటపడింది (Red Fort terror attack). ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో, తనను అరెస్ట్ చేస్తారనే భయంతోనే పేలుడు త్వరగా జరగాలని ఉమర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..
ఆత్మాహుతి అంటే బలిదానం.. వెలుగులోకి ఢిల్లీ పేలుళ్ల నిందితుడి సెల్ఫీ వీడియో..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..