Share News

Fish: జాలరి వలలో చిక్కిన అరుదైన చేప

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:43 AM

జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం జిల్లా పాంబన్‌ ఉత్తర తీరం నుంచి మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు.

Fish: జాలరి వలలో చిక్కిన అరుదైన చేప

చెన్నై: జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా పాంబన్‌ ఉత్తర తీరం నుంచి మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు. ఓ జాలరి వలలో అరుదైన ‘ఎల్లో టైల్‌ ట్యూనా’ అనే చేపతో పాటు పలురకాల చేపలున్నాయి. మూడు మీటర్ల వెడల్పు, 112 కిలోల బరువున్న ఈ చేపను నలుగురు జాలర్లు తీరానికి తీసుకొచ్చారు.


nani3.2.jpg

ఆ చేపను కేరళ(Kerala)కు చెందిన వ్యాపారి రూ.17 వేలకు కొనుగోలు చేశారు. ఈ విషయమై జాలర్లు మాట్లాడుతూ... ఎల్లో టైల్‌ ట్యూనా చేపలు అట్లాంటిక్‌, హిందూ మహా సముద్రాల్లో చాలా లోతైన నీటిలో మాత్రమే ఉంటాయన్నారు. ఈ చేపలు వలలో చిక్కడం చాలా అరుదుగా ఉంటుందని జాలర్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి దిగుమతులు మూడింతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 04:13 PM