Ramban Landslide: ప్రకృతి విలయం.. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:25 PM
వాతావరణ ప్రతికూలత, భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, టెక్నికల్ విద్యా సంస్థలు సోమవారం కూడా మూసే ఉంటాయని, ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగానే ఉండాలని రాంబాన్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాంబాన్: జమ్మూకశ్మీర్‌ను రెండ్రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తుండటం, కొండ చరియలు విరిగిపడి పలు రహదారులు మూసుకుపోవడం, అనేక ఇళ్లు దెబ్బతినడంతో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి విలయానికి ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు ఆదివారంనాడు మృతి చెందారు. 200 మందికి పైగా ప్రజలను సహాయక సిబ్బంది రక్షించింది. రాంబాన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెరుపు వరదల్లో చిక్కుకోవడం, కొండచరియల విరిగిపడుతుండటంతో సోమవారంనాడు కూడా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును పొడించారు.
Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా విమానం మళ్లించడంపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వివరణ
వాతావరణ ప్రతికూలత, భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, టెక్నికల్ విద్యా సంస్థలు సోమవారం కూడా మూసే ఉంటాయని, ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగానే ఉండాలని రాంబాన్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారీ వర్షాలపై అడ్వయిజరీ విడుదల చేసినట్టు రాంబాన్ డీసీ బషీర్-ఉల్-హక్ చౌదరి తెలిపారు. భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో జాతీయ రహదారి మూసేశామని, సుమారు 200 నుంచి 250 ఇళ్లు దెబ్బతిన్నాయని, సకాలంలో ప్రజలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు, స్కూళ్లకు తరలించామని తెలిపారు. సెరి జిల్లాలో గోడకూలి ముగ్గురు మరణించామని, సహాయక చర్యలు మమ్మురంగా కొనసాగుతున్నందున జాతీయ రహదారిని సోమవారానికి క్లియర్ చేసే అవకాశం ఉందన్నారు. మారుమాల ప్రాంతాల్లో మినహా పలు చోట్ల నిత్యావసర సర్వీసులను పునరుద్ధరించామని అన్నారు. డిస్ట్రిక్ డిజాస్టర్ మేనేజిమెంట్,ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసు టీమ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు.
సీఎం ఆవేదన
రాంబాన్‌లో మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగడంపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు స్థానిక యంత్రాగానికి ఆదేశాలిచ్చామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు ట్రావల్ అడ్వయిజరీని పాటించాలని, అనివార్య పరిస్థితుల్లో మినహా ఇళ్లలోంచి బయటకు వెళ్లవద్దని కోరారు.
ఇవి కూడా చదవండి..