Ayodhya: రామాలయ నిర్మాణం జూన్ 5 నాటికి పూర్తి
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:32 PM
అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. రామ్‌లల్లా గర్భగుడి గతంలోనే పూర్తయింది. తక్కిన మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతూ వచ్చాయి.

అయోధ్య: అయోధ్య (Ayodhya) లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో గత ఏడాది జనవరిలో ప్రారంభమైన రామాలయం (Ram Temple) మరికొద్ది రోజుల్లోనే పూర్తి నిర్మాణం కావించుకోనుంది. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నాటికి రామాలయ నిర్మాణం పూర్తవుతుందని, ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే ఆలయ ఆవరణలోని అన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు అనుమతిస్తామని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళవారంనాడు తెలిపారు.
PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, తేదీ-సమయం సైన్యమే నిర్ణయిస్తుంది: మోదీ
అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. రామ్‌లల్లా గర్భగుడి గతంలోనే పూర్తయింది. తక్కిన మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతూ వచ్చాయి. ఈ ఏడాది జూన్ 5వ తేదీ కల్లా 99 శాతం ఆలయ నిర్మాణం పూర్తవుతుందని నృపేంద్ర మిశ్రా తాజాగా వెల్లడించారు. మంగళవారంనాడు ఆలయం శిఖరంపై ధ్వజ్‌దండ్ (టెంపుల్ ఫ్లాగ్ పోల్) ఏర్పాటు చేశామని, దీంతో శిఖర నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఆలయం పూర్తి నిర్మాణం దాదాపుగా చివరిదశలో ఉందని తెలిపారు.
''మొదటి అంతస్తులోని 'రామ్ దర్బార్'లో రాముడు, సీత, హనుమ విగ్రహాలను మే 23న ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించిన సన్నాహకాలన్నీ పూర్తయ్యాయి. మే 23న విగ్రహాలు అయోధ్యకు చేరుకుంటాయి. ఆయా గర్భగుడుల్లో వాటిని ఉంచుతాం. మహర్షి వాల్మీకి, వశిష్ట, అహల్య, నిషదరాజ్ మహరాజ్,శబరి మాత, అగస్త్య ముని ఆలయాలను జూన్ 5 నుంచి ప్రజా సందర్శనకు అనుమతిస్తాం. రామ దర్బార్‌తో పాటు ఆరు ఆలయాల పూజా కార్యక్రమాలు జూన్ 5న జరుగుతాయి. పూర్తి ప్రోగ్రాం వివరాలను జూన్ 5న చంపత్ రాయ్ ప్రకటిస్తారు'' అని మిశ్రా తెలిపారు.
ఇవి కూడా చదవండి..