Parliament Session: పాకిస్థాన్‌కు భారత్ 30 నిమిషాల్లోనే లొంగిపోయిందా..?: రాహుల్ గాంధీ..
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:54 PM
హహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అమానుషమని, ఈ దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి మద్దతు తెలిపాయని, ఇందుకు తాము గర్విస్తున్నామని లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై లోక్‌సభలో రెండో రోజైన మంగళవారం నాడు జరిగిన ప్రత్యేక చర్చలో రాహుల్ మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ మండిపడ్డారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలుగా దేశ భద్రత విషయంలో తాము ప్రభుత్వానికి అండగా నిలిచామని, ఆపరేషన్ సిందూర్‌కు ముక్తకంఠంతో మద్దతు తెలిపామని చెప్పారు. ' మీకూ, సాయుధ బలగాలకూ అండగా నిలుస్తామని ప్రభుత్వానికి మేము చెప్పాం. ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇదే మాట చెప్పాం. మేమంతా ఈ విషయంలో గట్టిగా నిలబడ్డామని తెలియజేశాం' అని రాహుల్ అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన పాకిస్థాన్ పనేనని, పాక్ దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండించారని రాహుల్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపై నిలిచారని చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి బాధితులను తాము స్వయంగా కలిశామని చెప్పారు. త్రివిధ దళాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు రాజకీయ సంకల్పం ఉండాలని, 1971 యుద్ధంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని, అప్పటి జనరల్ మాణిక్‌షాకు ఇందిరాగాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ.
యుద్ధం చేసే సంకల్పం లేదు
యుద్ధం చేసే రాజకీయ సంకల్పం ఈ ప్రభుత్వానికి లేదనే విషయం రక్షణ మంత్రి చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు. 'మీరు దాడులు చేయొద్దని పాక్‌కు చెప్పడం దేనికి సంకేతం?, పాక్‌కు భారత్ 30 నిమిషాల్లోనే లొంగిపోయింది. 20 నిమిషాల్లోనే అంతా అయిపోయింది. అరగంటలోనే కాల్పుల విరమణను ప్రతిపాదించారు' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం