Tennis Star Radhika Yadav: ముందు నుంచే 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి.. రాధికా యాదవ్ పోస్ట్‌మార్టంలో వెల్లడి
ABN , Publish Date - Jul 11 , 2025 | 07:50 PM
రాధికా యాదవ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. నాలుగు బుల్లెట్లు ఆమె ఛాతీ నుంచి దూసుకెళ్లినట్టు వెల్లడైంది. ఇది దీపక్ కుమార్ అంగీకరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోని సమాచారానికి భిన్నంగా ఉంది.

గురుగ్రామ్: హరియాణాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (Radhik Yadav)ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ గురువారంనాడు హత్య చేసిన ఘటన సంచలనమైంది. సామాజిక మాధ్యమాల్లో అదేపనిగా రీల్స్ చేస్తుండటం, ఆమె తీరుకారణంగా తెలిసి వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో కన్నతండ్రే ఆమెను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ విషయాన్ని దీపక్ యాదవ్ అంగీకరించాడు. అయితే తాజాగా రాధికా యాదవ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. నాలుగు బుల్లెట్లు ఆమె ఛాతీ నుంచి దూసుకెళ్లినట్టు వెల్లడైంది. ఇది దీపక్ కుమార్ అంగీకరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోని సమాచారానికి భిన్నంగా ఉంది. తన కుమార్తెను వెనుక నుంచి కాల్చినట్టు దీపక్ అంగీకరించాడని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నాలుగు బుల్లెట్లు ముందునుంచే కాల్చినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదిక చెబుతోంది.
రాధికపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని, ఆమె ఛాతీ వద్ద బుల్లెట్ గాయాలయ్యాయని ప్రభుత్వ ఆసుపత్రి బోర్డ్ మెంబర్, సర్జన్ డాక్టర్ దీపక్ మాథూర్ తెలిపారు. మృతదేహం నుంచి బుల్లెట్లు బయటకు తీసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టంలో వెలుగుచూసిన విషయం, నిందితుడు చెప్పిన విషయం పరస్పర విరుద్ధంగా ఉండటంతో రాధిక హత్యకు దారితీసిన పరిస్థితులపై కొత్త అనుమానాలు తావిస్తోందని అంటున్నారు.
వెలుగుచూసిన మ్యూజిక్ వీడియో
నేషనల్ లెవెల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను టెన్నిస్ అకాడమీ మూసేయాలని దీపక్ యాదవ్ చెబుతూ వచ్చారని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడికట్టాడని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలని రాధిక ఆసక్తిగా ఉండటం కూడా తండ్రికి నచ్చలేదని చెబుతున్నారు. ఆసక్తికరంగా, రాధిక హత్య అనంతరం 'కార్వాన్' అనే టైటిల్‌తో ఉన్న మ్యూజిక్ వీడియో వెలుగుచూసింది. మ్యూజిక్ వీడియోలో ఆమె నటించడం ఈ హత్యకు ఒక కారణమై ఉండవచ్చా అనే దానిపై కూడా ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీహార్‌లో ఓట్ల చోరీకి కుట్ర.. ఈసీపై రాహుల్ విమర్శలు
భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి