Share News

Punjab: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:12 PM

పంజాబ్ పోలీసుల ఆపరేషన్‌లో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక పిస్తోలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పట్టుబడిన ఇద్దరిని అమృత్‌సల్ రూరల్‌కు చెందిన సెహజ్‌పాల్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్‌గా గుర్తించామని తెలిపారు.

Punjab: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు

చండీగఢ్: పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో భారీ ఉగ్రకుట్రను జరిగిన ప్లాన్‌ను పంజాబ్ పోలీసులు శుక్రవారంనాడు భగ్నం చేశారు. టెర్రర్ మాడ్యూల్ ఆటకట్టించారు. ఉగ్ర కుట్రకు పన్నాగం పన్నిన ఒక మైనర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిని బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌ (BKI)కు చెందిన వారిగా గుర్తించారు. భారీ ఉగ్రకుట్రను భగ్నం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడగలిగామని డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అమృత్‌సర్‌లో లక్షిత హత్యలు, పోలీసు స్టేషన్లపై దాడులకు ఈ టెర్రర్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్టు చెప్పారు.


'ఇంటెలిజెన్స్ సమాచారంతో రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. పాక్ ఐఎస్ఐ సహకారం కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ టెర్రర్ మాడ్యూల్‌ను విజయవంతంగా పట్టుకున్నాం. యూకేకు చెందిన నిషాన్ సింగ్, పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్ హర్వీందర్ రిండాలు దీనిని ఆపరేట్ చేస్తున్నారు. బీకేఐతో అసోసియేషన్ కలిగిన ఒక జువనైల్, మరో ఇద్దరిని అరెస్టు చేశాం' అని డీజీపీ తెలిపారు.


ఈ ఆపరేషన్‌లో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక పిస్తోలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పట్టుబడిన ఇద్దరిని అమృత్‌సల్ రూరల్‌కు చెందిన సెహజ్‌పాల్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్‌గా గుర్తించామని, మరో జువెనైల్ కూడా ఉన్నాడని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, పేలుడు పదార్ధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మొహాలి పోలిస్ స్టేషన్‌ను ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. రాష్ట్రంలో టెర్రర్ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసి, సంస్థాగత నేరాలను నిర్మూలించడం ద్వారా శాంతి, సామరస్య స్థాపనకు పంజాబ్ పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారని వివరించారు.


దీనికి ముందు ఏప్రిల్‌లో పంజాబ్ పోలీసులు ఐఎస్‌ఐ సహకారం ఉన్న ఖలిస్థాన్ టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన 13 మందిని అరెస్టు చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఐఈడీలు, ఆర్‌డీఎక్స్, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

మళ్లీ షాకింగ్ ఘటన.. లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..

For More National News

Updated Date - Jun 27 , 2025 | 05:14 PM