Shivangi Singh: రాష్ట్రపతితో రఫేల్ రాణి శివాంగి సింగ్.. పాక్ కట్టుకథలకు మరోసారి చెక్
ABN , Publish Date - Oct 29 , 2025 | 07:56 PM
రఫేల్ ఫైటర్ జెట్‌ను నడిపిన తొలి ఇండియన్ మహిళా పైలట్‌గా శివాంగి సింగ్ రికార్డుల్లో నిలిచారు. దీనికి ముందు ఆమె అంబాలోని గోల్డెన్ యారోస్ స్వ్కాడ్రన్‌లో విధులు నిర్వహించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) బుధవారంనాడు అంబాలా ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు. స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ (Sivangi Singh)ను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో రఫేల్ యుద్ధ విమానాన్ని శివాంగి సింగ్ నడిపారు. ఆ సందర్భంలోనే సియాల్‌కోట్ సమీపంలో రాఫెల్ విమానాన్ని కూల్చేసి, శివాంగి సింగ్‌ను బంధించామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం సాగించింది. అయితే పాక్ దుష్ప్రచారాన్ని భారత వాయుసేన వెంటనే తిప్పికొట్టింది. ఫెలిసిటేషన్ సెర్మనీలో దిగిన సింగ్ ఫోటోలను విడుదల చేసింది. దీంతో రఫేల్ రాణిగా శివాంగి సింగ్ పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఎవరీ శివాంగీ సింగ్
రఫేల్ ఫైటర్ జెట్‌ను నడిపిన తొలి ఇండియన్ మహిళా పైలట్‌గా శివాంగి సింగ్ రికార్డుల్లో నిలిచారు. దీనికి ముందు ఆమె అంబాలోని గోల్డెన్ యారోస్ స్వ్కాడ్రన్‌లో విధులు నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ గగనతల దాడులను భారత వాయిసేన సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
వారాణాసిలో జన్మించిన శివాంగి సింగ్.. బెనారస్ హిందూ యూనివర్శిటీ డిగ్రీ పట్టా పొందారు. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే ఆకాంక్ష ఆమెకు ఉండేది. 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. 2020లో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అంబాలా ఎయిర్‌బెస్ 'గోల్డెన్ యూరోస్' స్క్వాడ్రన్ బృందంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి