Share News

Praveen Sood: సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్ సూద్ కొనసాగింపు

ABN , Publish Date - May 06 , 2025 | 11:02 AM

నూతన సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం ప్రధాని మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నాలతో కుడిన సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత అధికారుల పేర్లపై సెలెక్ట్ కమిటీలో చర్చ జరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Praveen Sood: సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్ సూద్ కొనసాగింపు
CBI Director Praveen Sood

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌ (CBI Chief)గా ప్రస్తుత డైరెక్టర్ (Director) ప్రవీణ్ సూద్ (Praveen Sood) కొనసాగింపుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీకాలం మరో ఏడాది పొడిగించారు (extended). ఈ మేరకు డీవోపీటీ (DOPT) త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈనెల 25తో ప్రవీణ్ సూద్ రెండేళ్ల పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో ఆయన పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2023, మే 25న సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కాగా నూతన డైరెక్టర్ నియామకంపై సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

Also Read: సివిల్ డిఫెన్స్ డ్రిల్‌పై కీలక సమావేశం..


సెలక్ట్ కమిటీ భేటీ..

కాగా నూతన సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం నిన్న (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నాలతో కూడిన సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. తదుపరి డైరెక్టర్ కోసం పలువురు పేర్లతో డీవోపీటీ జాబితాను రూపొందించింది. ప్రతిపాదిత అధికారుల పేర్లపై సెలెక్ట్ కమిటీలో చర్చ జరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.


ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ..

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సౌత్‌ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పహల్గాం దుర్ఘటన అనంతరం తలెత్తిన పరిస్థితులు, సైన్యం సన్నద్ధతపై రాహుల్‌తో అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌, సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. నిజానికి ఈ సమావేశం సీబీఐ తదుపరి చీఫ్‌ ఎంపిక కోసం జరిగింది. సీబీఐ చీఫ్‌ను ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. దాంతో రాహుల్‌తో పాటు సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కూడా ప్రధాని కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుత సీబీఐ చీఫ్‌ ప్రవీణ్‌ సూద్‌ ఈ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో దీనిని ఐదేళ్ల వరకు పొడిగించే వెసులుబాటు చట్టంలో ఉంది. కాగా కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్, గతంలో ఆ రాష్ట్ర డీజీపీగా పనిచేశారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ఆయన 2023 మే నెలలో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీపీఎస్సీ నియామకం కేసులో కీలక పురోగతి...

60 రోజులు 339 పనులు..సీఎం, లోకేష్‌లకు వివరించిన కోటంరెడ్డి

For More AP News and Telugu News

Updated Date - May 06 , 2025 | 03:46 PM