Share News

Patna: లిక్కర్ మాఫియా దాడి.. 11 మంది పోలీసులకు గాయాలు, రెండు వాహనాలకు నిప్పు

ABN , Publish Date - Mar 08 , 2025 | 09:40 PM

అక్రమమద్యం మాఫియా రెచ్చిపోయింది. తనిఖీల కోసం వచ్చిన పోలీసులపై దాడులకు దిగడంతో 11 మంది పోలీసులు గాయపడ్డారు. రెండు పోలీసుల వాహనాలకు నిప్పుపెట్టారు.

Patna: లిక్కర్ మాఫియా దాడి.. 11 మంది పోలీసులకు గాయాలు, రెండు వాహనాలకు నిప్పు

పాట్నా: బీహార్‌లోని పాలిగంజ్‌లో అక్రమమద్యం మాఫియా రెచ్చిపోయింది. తనిఖీల కోసం వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడులకు దిగడంతో 11 మంది పోలీసులు గాయపడ్డారు. రెండు పోలీసుల వాహనాలకు నిప్పుపెట్టారు. మద్యం తయారీ, అమ్మకాలపై రాష్ట్రంలో నిషేదం అమల్లో ఉండగా, హోలి పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శనివారంనాడు తనిఖీలు చేపట్టినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుటాహుటిన అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. గాయపడిన పోలీసులను ఆసుపత్రిలో చేర్చగా, ఐదుగురు అనుమానితులు పోలీసులు అరెస్టు చేశారు.

Haridwar: హరిద్వార్‌ రిషికుల్ కాలేజీలో ఇఫ్తార్.. విరుచుకుపడిన బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు


ఘటన వివరాలను రాణితాల్ ఎస్‌హెచ్ఓ వివరిస్తూ, హోలీ పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం తయారీలపై పోలీసు తనిఖీలు చేపట్టారని చెప్పారు. రఘోపూర్‌లో తనిఖీలు చేస్తుండగా లిక్కర్ ట్రేడర్లు పోలీసు టీమ్‌పై దాడి చేశారని, రెండు వాహనాలను ధ్వంసం చేశారని చెప్పారు. గాయపడిన 11 మంది పోలీసులను ఆసుపత్రిలో చేర్చినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామన్నారు.


రఘోపూర్ ముషారిలో హోలి పండుగ కోసం అక్రమ మద్యం తయారీ జరుగుతోందని తమకు సమాచారం రావడంతో పోలీసు టీమ్ అక్కడకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిందని, అకస్మాత్తుగా లిక్కర్ మాఫియాకు చెందిన కొందరు రాళ్లు రువ్వారని డీఎస్పీ ప్రీతం సింగ్ తెలిపారు. విషయం తెలియగాలనే సమీప పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలు అక్కడకు పంపినట్టు చెప్పారు. ఇంతవరకూ ఐదుగురిని అరెస్టు చేశామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2025 | 10:02 PM