Share News

PM Modi: సౌదీ అరేబియాలో మోదీ రెండ్రోజుల పర్యటన

ABN , Publish Date - Apr 19 , 2025 | 02:53 PM

క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పర్యటించి జి-20 సదస్సు, ఇండియా-సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్‌కు కో-చైర్మన్‌గా వ్యవహరించారని, ఆ సందర్భంలో మోదీని తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

PM Modi: సౌదీ అరేబియాలో మోదీ రెండ్రోజుల పర్యటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సౌదీ అరేబియా (Saudi Arabia) పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో ఆయన సౌదీ ఆరేబియాలో అధికారిక పర్యటన జరుపనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటనకు వెళ్తున్నారు. సౌదీలో మోదీ పర్యటించనుండటం ఇది మూడోసారి. గతంలో 2016, 2019లో ఆదేశంలో పర్యటించారు.

CEC: రెండాకుల గుర్తు వ్యవహారం.. 28న విచారణకు హాజరుకండి


క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పర్యటించి జి-20 సదస్సు, ఇండియా-సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్‌కు కో-చైర్మన్‌గా వ్యవహరించారని, ఆ సందర్భంలో మోదీని తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, సౌదీ మధ్య చిరకాల మైత్రీసంబంధాలు ఉన్నాయి. బలమైన చారిత్రక వాణిజ్య సంబంధాలు, లోతైన సామాజిక-సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నాయి. రాజకీయ, రక్షణ, భద్రత, పెట్టుబడులు, ఇంధనం, టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య రంగాల్లోనూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి.


మోదీ పర్యటనతో ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు పరస్పరం ప్రయోజనం చేకూరే పలు అంశాలపై ఉభయనేతలు చర్చిస్తారని ఎంఈఏ తెలిపింది.


Delhi Men's Satyagraha : భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా.. దయచేసి మగాళ్లకూ రక్షణ కల్పించండి..

BJP: తేల్చి చెప్పేశారుగా.. అధికారంలో భాగస్వామ్యం కోరం..

Updated Date - Apr 19 , 2025 | 09:20 PM