Share News

PM Modi G20 Summit: జీ20 సదస్సుకు మోదీ.. 21న దక్షిణాఫ్రికా పయనం

ABN , Publish Date - Nov 19 , 2025 | 09:11 PM

జీ-20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.

PM Modi G20 Summit: జీ20 సదస్సుకు మోదీ.. 21న దక్షిణాఫ్రికా పయనం
PM Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దక్షిణాఫ్రికా (South Africa) పర్యటన ఖరారైంది. ఈనెల 21 నుంచి 23 వరకూ జోహాన్స్‌బర్గ్‌ (Johannesburg)లో జరుగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్ (G20 Leaders Summit)లో ప్రధాని పాల్గొంటారు. ఇందుకోసం ఈనెల 21న ప్రధాని దక్షిణాఫ్రికా వెళ్తున్నట్టు విదేశాంగ శాఖ (MEA) బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గ్లోబల్ సౌత్‌లో వరుసగా జరుగుతున్న నాల్గవ జీ20 సదస్సు అని, ఈ సదస్సులో జీ20 ఎజెండాపై భారతదేశ దృక్పథాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారని పేర్కొంది.


modi2.jpg

కాగా, జీ20 సదస్సులో జరిగే మూడు సెషన్లలోనూ ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. సమ్మిళిత, సుస్థిర ఆర్థికాభివృద్ధి, విపత్తు ప్రమాద తగ్గింపులో జీ20 కంట్రిబ్యూషన్, వాతావరణ మార్పులపై సదస్సులో చర్చించనున్నారు. కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్), కృత్రిమ మేథస్సు (ఏఐ)పై కూడా ఒక సెషన్ జరుగనుంది.


జీ20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

నితీశ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి

ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2025 | 09:22 PM