Share News

PM Modi: ట్రంప్‌ను మిత్రుడుగా ఇష్టపడతారా? లీడర్‌గానా?.. మోదీ ఏం చెప్పారంటే

ABN , Publish Date - Mar 16 , 2025 | 07:46 PM

మోదీ తనకు అత్యంత ఆప్త మిత్రుడని పలు సందర్భాల్లో ట్రంప్ ప్రశంసిస్తే, మోదీ సైతం ట్రంప్ పట్ల తనకున్న స్నేహభావాన్ని చాటుకున్నారు. అయితే ట్రంప్‌ను ఒక మిత్రుడిగా మోదీ ఎక్కువగా ఇష్టపడతారా? నాయకుడిగా ఇష్టపడతారా? ఓసారి చూద్దాం.

PM Modi: ట్రంప్‌ను మిత్రుడుగా ఇష్టపడతారా? లీడర్‌గానా?.. మోదీ ఏం చెప్పారంటే

న్యూఢిల్లీ: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వరుసగా మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా సత్తా చాటుకుంటున్న నరేంద్ర మోదీ (Narendra Modi) మధ్య చిరకాల స్నేహం జదద్విదితం. మోదీ తనకు అత్యంత ఆప్త మిత్రుడని పలు సందర్భాల్లో ట్రంప్ ప్రశంసిస్తే, మోదీ సైతం ట్రంప్ పట్ల తనకున్న స్నేహభావాన్ని చాటుకున్నారు. అయితే ట్రంప్‌ను ఒక మిత్రుడిగా మోదీ ఎక్కువగా ఇష్టపడతారా? నాయకుడిగా ఇష్టపడతారా?. ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ (Lex Fridman) పాడ్‌కాస్ట్‌లో నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది


డొనాల్డ్ ట్రంప్ ''అమెరికా ఫస్ట్"' నినాదంపై మోదీ ప్రశంసలు కురిపిస్తూ, తాను అనుసరిస్తున్న ''ఇండియా ఫస్ట్'' నినాదంతో ట్రంప్ నినాదాన్ని పోల్చారు. ట్రంప్‌లోని ధైర్యం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, 'అమెరికా ఫస్ట్' విధానం తనను ఆకట్టుకున్నాయని మోదీ అన్నారు. 2019లో హోస్టన్‌లోని జరిగిన ''హౌడీ, మోదీ" ఈవెంట్‌ సందర్భంగా ట్రంప్ చూపించిన ఆదరణ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆ ఈవెంట్‌కు హాజరైన ప్రజానీకంతో స్టేడియం కిక్కిరిసిపోయిందని, సహజంగా క్రీడలు జరిగినప్పుడు స్టేడియంలు నిండిపోతాయని, ఒక పొలిటికల్ ర్యాలీకి ఇంత అసాధారణ స్పందన రావడం విశేషమని అన్నారు. అమెరికాలోని భారత సంతతి ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరైందని, ఇద్దరూ ప్రసంగించామని, నేను మాట్లాడుతుంటే ఆయన ఆడియెన్స్‌లో కూర్చుని మరీ విన్నారని, అది ట్రంప్‌కు ఉన్న వినయాన్ని చాటుతుందని కొనియాడారు.


నాతో కలిసి నడిచారు..

వేదికపై ప్రసంగం ముగించుకుని తాను కిందకు రాగానే స్టేడియం చుట్టూ తిరగాలని ఉందని చెప్పినప్పుడు ట్రంప్ ఒక్క నిమిషం కూడా వెనుకాడలేదని, తనతో పాటు స్టేడియం చుట్టూ అడుగులో అడుగు వేశారని, తన సెక్యూరిటీని సైతం దూరంగా పెట్టేశారని మోదీ గుర్తుచేసుకున్నారు. ట్రంప్ సొంత నిర్ణయాలు తీసుకుంటూనే నన్ను (మోదీ) కూడా విశ్వసించారని, పరస్పర విశ్వాసం కలిగి ఉండటం అనేది ఆ రోజు తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.


వైట్‌హౌస్‌లో..

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను తొలిసారి శ్వేత సౌధం (White House) వెళ్లిన సందర్భా్న్ని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. ట్రంప్‌ను అంతకుముందు కూడా తాను అనేక సందర్భాల్లో కలిసినప్పటికీ శ్వేత సౌధంలో కలవడం గుర్తిండిపోతుందన్నారు. తాను అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టగానే ప్రోటోకాల్స్‌ను పక్కనపెట్టేసి ఆత్మీయ స్వాగతం పలికారని చెప్పారు. ఆ తర్వాత శ్వేతసౌధం టూర్‌కు తీసుకెళ్లి దగ్గరుండి మరీ అన్నీ చూపించారని మోదీ గుర్తుచేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 07:51 PM