PM Kisan : ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:49 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అలా బటన్ నొక్కడమే ఆలస్యం.. దేశ వ్యాప్తంగా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చెందాయి..
చెన్నై, నవంబర్ 19: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇప్పటి వరకు 20 విడతలుగా పీఎం కిసాన్ డబ్బులు వేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 21 విడత నిధులను రైతుల ఖతాల్లోకి బదిలీ చేసింది.
బుధవారం నాడు తమిళనాడులో కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనలోనే పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారాయన. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లకు పైగా నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని రైతులను సూచించారు. అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి సారం దెబ్బతింటుందన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపాలన్నారు. సేంద్రీయ వ్యవసాయంతో భూసారం పెరగడంతో పాటు.. అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను సైతం ఎదుర్కునే అవకాశం ఉంటుందన్నారు ప్రధాని. దేశ రైతులు తృణ ధాన్యాలను పండించడంపై ఫోకస్ పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
రైతులకు అండగా నిలిచే ఉద్దేశంతో పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు మూడు విడతల్లో రూ. 2 వేలు చొప్పున విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 21వ విడత నిధులను విడుదల చేశారు.
Also Read:
ఏంట్రా ఇదీ.. పోలీస్ వాహనాన్ని వీరెలా వాడారో చూస్తే..
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కోల్పోయిన రోహిత్ శర్మ
ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీశ్ ఎన్నిక... సీఎంగా గురువారం ప్రమాణస్వీకారం