PM Kisan: రేపు కిసాన్ సమ్మాన్ నిధుల జమ
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:47 AM
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద శనివారం (ఆగస్టు 2న) రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది

20వ విడత కింద 20,500 కోట్లు విడుదల
న్యూఢిల్లీ, జూలై 31: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద శనివారం (ఆగస్టు 2న) రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం కోసం 20వ విడత నిధుల కింద రూ.20,500 కోట్లు విడుదలయ్యాయి. దీని ద్వారా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఆ రోజున వారాణసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రైతుల ఖాతాకు ఏటా రూ.6,000 చొప్పున మూడు వాయిదాల్లో జమ అవుతుందని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News