Share News

Income Tax Bill: జరిమానా లేకుండా టీడీఎస్‌ను వాపసు చేయాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:38 AM

ఆదాయపు పన్ను చట్టం 2025లో పలు సవరణలు చేయాలని సూచిస్తూ పార్లమెంటరీ కమిటీ సోమవారం లోక్‌సభకు..

Income Tax Bill: జరిమానా లేకుండా టీడీఎస్‌ను వాపసు చేయాలి
Income Tax Bill

  • ఐటీ బిల్లుపై 566 సూచనలు

  • పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ, జూలై 21: ఆదాయపు పన్ను చట్టం-2025లో పలు సవరణలు చేయాలని సూచిస్తూ పార్లమెంటరీ కమిటీ సోమవారం లోక్‌సభకు నివేదిక సమర్పించింది. లోక్‌సభలో బీజేపీ సభ్యుడు బైజయంత్‌ పండా ఆధ్వర్యంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్‌ కమిటీ ఈ బిల్లుపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. మార్పులు, సవరణలపై మొత్తం 566 సూచనలు చేసింది. ఇందులో 32 కీలక సిఫార్సులు ఉన్నాయి. నిర్వచనాలను సరళతరం చేసి, చట్టం సులభంగా అర్థమయ్యేలా ఉండాలని తెలిపింది. అందువల్ల ‘మునుపటి సంవత్సరం’ (ప్రీవియస్‌ ఇయర్‌), ‘అసె్‌సమెంట్‌ ఇయర్‌’ (మదింపు సంవత్సరం) అన్న పదాలకు బదులుగా ‘పన్ను సంవత్సరం’ (ట్యాక్స్‌ ఇయర్‌) అన్న ఒక్క పదాన్నే ఉపయోగించాలని సూచించింది. 4,575 పేజీల ఈ నివేదికలో పన్ను మినహాయింపులపైనా సూచనలు చేసింది. తక్కువ ఆదాయం ఉండే ఉద్యోగులకు ఊరట కలిగించేలా కీలక సిఫార్సు చేసింది. పన్ను చెల్లించాల్సిన అసవరం లేనప్పటికీ కొందరు ఉద్యోగులకు టీడీఎస్‌ కింద జీతంలో పన్ను మినహాయిస్తారు. అనంతరం నిర్ణీత తేదీలోగా రిటర్నులు సమర్పిస్తే వసూలు చేసిన పన్నును తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ రిటర్నులు సవర్పించడంలో జాప్యం జరిగితే జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను ఇకపై విధించకూడదని సిఫార్సు చేసింది. మత-ధార్మిక సంస్థలకు గుప్తంగా లభించే అప్రకటిత విరాళాలకు పన్ను మినహాయింపులను కొనసాగించాలని సూచించింది. ‘క్యాపిటల్‌ అస్సెట్‌’, ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్యాపిటల్‌ కంపెనీ’ వంటి నిర్వచనాలను ఆధునికీకరించాలని, ‘వ్యాపార ఖర్చులు’లో అనే అంశంలో ‘వాస్తవ చెల్లింపులు’ అనే మాటను పునరుద్ధరించాలని కోరింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:38 AM