President Rule: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:04 AM
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13 తర్వాతి నుంచి మరో ఆరు నెలలు పొడిగించడానికి సంబంధించిన..

తీర్మానానికి లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ, జూలై 30: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13 తర్వాతి నుంచి మరో ఆరు నెలలు పొడిగించడానికి సంబంధించిన తీర్మానానికి బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ తీర్మానాన్ని లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టారు. మణిపూర్‌లో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన ను విధించగా.. ఏప్రిల్ 2న పార్లమెంట్ ఆమోదం తెలిపిందని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. రాష్ట్రపతిపాలనకు పార్లమెంట్ తెలిపిన ఆమోదం ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించాలంటే చట్టబద్ధమైన తీర్మానాన్ని పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాతి నుంచి ఒకే ఒక మరణం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి స్థాపనకు రాష్ట్రపతి పాలన ముఖ్యమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు.