Share News

Edappadi Palaniswami: అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధం

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:52 AM

జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి

Edappadi Palaniswami: అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధం

చెన్నై, జూలై 14(ఆంధ్రజ్యోతి): జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ఓ మెట్టు దిగొచ్చారు. తనకెలాంటి పదవులు వద్దని, ఎలాంటి షరతుల్లేకుండానే అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, పన్నీర్‌సెల్వం, జయ నెచ్చెలి శశికళను పార్టీలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. దీనికితోడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన.. ఎన్‌డీఏ నేతృత్వంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 04:52 AM