Abhishek Banerjee: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ అధికారులు.. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి..
ABN , Publish Date - May 28 , 2025 | 03:39 PM
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.

సింగపూర్: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఎండగట్టారు. ఆ దేశ ఉగ్రవాదానికి సంబంధించి పబ్లిక్ డొమైన్‌లో ఎన్నో సాక్ష్యాలున్నాయని చెప్పారు. జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అలాంటి సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాలను పట్టించుకోమని తెలిపారు.
పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయని, ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ మిలటరీ ఉన్నతాధికారులు పాల్గొనడమే ఇందుకు బలమైన నిదర్శనమని అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో అందరూ వీటిని చూశారని, ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక మెసేజ్‌లను విస్తృత వ్యాప్తిలోకి తీసుకువస్తూ సోషల్ మీడియా సత్తా చాటుకుంటోదన్నారు. సంప్రదాయ దౌత్యం కంటే వేగంగా సోషల్ మీడియా దూసుకెళ్తోందని ప్రశంసించారు.
ఇండియన్ హైకమిషనర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ, ఇండియా-సింగపూర్ మధ్య 60 ఏళ్ళుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. పరస్పరం మరింత సహకరించేదుకు డిజిటల్ స్పేస్, స్కిల్లింగ్, హెత్, మారటైమ్, ఎయిర్ కనెక్టివిటీ, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి ఆరు కీలక రంగాలను గుర్తించామని చెప్పారు. జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా సారథ్యంలో సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎంపీ ప్రతినిధుల బృందంలో అపరాజిత సారంగి (బీజేపీ), టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బ్రిజ్ లాలా (బీజేపీ), జాన్ బ్రిట్రాస్ (సీపీఎం), ప్రదాన్ బారుహ్ (బీజేపీ), హేమాంగ్ జోషి (బీజేపీ), సల్మాన్ ఖుర్షీద్, మోహన్ కుమార్ ఉన్నారు.
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే ఎమ్మెల్యేలు
ఇక భారత్‌ను చూసి పాక్ వణకాల్సిందే..
Read Latest National News and Telugu News