Pakistan: భారత 'గూఢచారి డ్రోన్'ను కూల్చేశామన్న పాక్
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:52 PM
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్‌లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్‌ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో గూఢచర్యం చేస్తున్న భారత డ్రోన్ (Spy Drone)ను కూల్చేసినట్టు పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించుకుంది. కశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్‌ను అతిక్రమించిన మానవ రహిత డ్రోన్‌ను కూల్చేశామని పాక్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పాక్ టెలివిజన్ ఒక వార్తను ప్రసారం చేసింది.
Pakistan Ceasefire: కశ్మీర్‌లో ఐదో రోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్‌లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్‌ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.
యుద్ధానికి అవకాశం ఉంది
దీనికి కొద్ది గంటలకు ముందే పాకిస్థాన్ రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు భారత్‌తో యుద్ధానికి అవకాశం ఉందని హెచ్చరించారు. రాబోయే కొద్ది రోజులు చాలా కీలకమని రక్షణ శాఖ మంత్ర ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ 'జియో న్యూస్'తో మాట్లాడుతూ చెప్పారు. ఏదైనా జరిగితే అది రెండు మూడ్రోజుల్లో జరగవచ్చని, తక్షణ ముప్పు పొంచి ఉందని అన్నారు. అయితే ఘర్షణల నివారణకు చైనా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాగా, మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత ఆర్మీ స్పందించలేదు.
వరుసగా ఐదోరోజు కాల్పుల విరమణకు పాక్ తూట్లు
కాగా, పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి బుధవారంనాడు మరోసారి తూట్లు పొడిచింది. ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అఖ్నూర్ సెక్టార్‌లో ఎల్ఓసీ వెంబడి చిన్నచిన్న ఆయుధాలతో కాల్పులు జరుపుతున్నట్టు భారత బలగాలు తెలిపాయి. వాటిని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నట్టు ఆర్మీ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వరుసగా ఇది ఐదోరోజు.
ఇవి కూడా చదవండి..