Terrorist Attack: పహల్గాం అటాక్.. అంతర్జాతీయ మీడియా మొహాన ఉమ్మేసిన అమెరికా
ABN , Publish Date - Apr 26 , 2025 | 06:36 PM
ఊరందరిదీ ఒకదారి.. తమది మరో దారన్నట్టుగా పాశ్చాత్య మీడియా పోకడలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఘటన జరిగింది మొదలు.. వచ్చిన మొదటి వార్త నుంచీ కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలైన..

Terrorist Attack - America : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీ మిట్టమధ్యాహ్నం 26 మందిని కాల్చి చంపిన మారణహోమం గురించి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ దుర్మార్గపు దాడిని ఖండిస్తూ ప్రపంచదేశాలు ముక్తకంఠంతో నినదించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాధినేతలు, ఆఖరికి ఆయా దేశాల ప్రతిపక్షనేతలు సహా ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ప్రకటనలు చేశారు. భారతదేశానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు.
ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి ప్రసారం చేసే పనిలో ఉంటుంది మీడియా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మీడియా పని. ఇది భారత మీడియా, మిగతా మీడియా సంస్థలు పహల్గాం దాడిని ఉగ్రదాడిగానే అభివర్ణిస్తూ సమాచారం అందిస్తున్నాయి. ప్రచురిస్తున్నాయి. ఊరందరిదీ ఒకదారి.. తమది మరో దారన్నట్టుగా పాశ్చాత్య మీడియా పోకడలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఘటన జరిగింది మొదలు వచ్చిన మొదటి వార్త నుంచీ కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలైన 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా', 'సీఎన్ఎన్', 'బీబీసీ'లు తమ రూటు సపరేటు అంటూ సాగుతున్నాయి.
ఎంతోకాలంగా మీడియా రంగంలో ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉదంతాలు కళ్లారా చూసి.. పూర్తి సమాచారాన్ని కనుగొని అందించిన అనుభవమున్న సదరు పాశ్చాత్య మీడియాకు పహల్గాం దాడి 'ఉగ్రదాడి' అని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రచురించిన మొదటి వార్త నుంచి కూడా ఈ దాడిని మిలిటెంట్ల దాడిగానో, లేదా గన్ మెన్ దాడి చేశారనో పాశ్చాత్య మీడియా హెడ్డింగులు పెడుతోంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఉగ్రవాదుల దాడికి, మిలిటెంట్లు(స్వదేశంలోని తిరుగుబాటుదారులు), గన్ మెన్(గన్ లు చేతపట్టిన మామూలు వ్యక్తులు)లు చేసే దాడికి మధ్య తేడాలు కూడా పేరుమోసిన ఆయా పాశ్చాత్య మీడియా సంస్థలకు ఎందుకు తెలియడం లేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
పారదర్శకతకు పాతరేసి.. కావాలనే, లేదా ద్వేషంతో వార్తలని ఇస్తున్నారా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆశ్చర్యకరంగా పాశ్చాత్య మీడియా తీరుపై అదీ.. పహల్గాం ఘటనకు సంబంధించి అగ్రరాజ్యం గట్టిగా స్పందించింది. సదరు మీడియా మొహాన ఉమ్మేసినట్టుగా కామెంట్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి వార్తలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక అయిన 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' పెట్టిన ఒక హెడ్డింగుని స్క్రీన్ షాట్ తీసి.. కరెక్ట్ చేసి.. ఇదీ మీరు చేస్తున్న తప్పు అని చెప్పి మరీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది అమెరికా యంత్రాంగం. అమెరికా 'హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ' సదరు మీడియా వైఖరిని తన ఎక్స్(సోషల్ మీడియా మాధ్యమం) ఖాతాలో ఎత్తి చూపింది.
అమెరికా హౌస్ పారిన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ తన ట్వీట్ లో ఏమందంటే.. "హే, @nytimes(న్యూ యార్క్ టైమ్స్) మేము దీన్ని మీ కోసం సరిచేశాం. ఇది చాలా స్పష్టంగా, సరళంగా ఒక ఉగ్రవాద దాడి. భారతదేశమైనా, ఇజ్రాయిల్ అయినా, ఉగ్రవాదం విషయంలో NYT(న్యూ యార్క్ టైమ్స్) వాస్తవికత నుండి దూరంగా ఉంది." అంటూ చెంప చెళ్లుమనేలా ఇచ్చింది.
కాగా, ఈ పాశ్చాత్య మీడియా సంస్థలు కశ్మీర్ కు సంబంధించి వార్తలు ప్రచురించాల్సి వస్తే, ఇప్పటికీ ఇండియా పరిపాలిత కశ్మీర్ అని రాస్తుంటాయి. జమ్ము, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని తెలిసినా కూడా ఇప్పటికీ కేవలం ఇండియా పరిపాలితమే.. ఆ దేశానికి చెందినది కాదన్నట్టుగా వార్తలు ప్రచురిస్తుండటం వాళ్ల ఈర్ష్యా, ద్వేషాలకు, లేదా వాళ్ల యొక్క ఇన్నర్ ఎజెండాకు తార్కాణమనుకోవాలి.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్