Growth Deficiency: 63 జిల్లాల్లో 50% పైగా చిన్నారుల్లో ఎదుగుదల లోపం
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:38 AM
దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళనకరంగా ఉంది. 13 రాష్ట్రాలు, యూటీల్లోని 63 జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల్లో 50 శాతానికి పైగా ఎదుగుదల లోపం

న్యూఢిల్లీ, జూలై 27: దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళనకరంగా ఉంది. 13 రాష్ట్రాలు, యూటీల్లోని 63 జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల్లో 50 శాతానికి పైగా ఎదుగుదల లోపంలో బాధపడుతున్నారని పార్లమెంట్‌లో సమర్పించిన పలు పత్రాల డేటా వెల్లడించింది. 199 జిల్లాల్లో ఇది 30 నుంచి 40 శాతం మధ్య ఉందని పేర్కొంది.
పిల్లలు చాలా కాలం పాటు తగిన పోషకాహారం తీసుకోనప్పుడు సంభవించే దీర్ఘకాలిక పోషకాహార లోపాన్నే ఎదుగుదల లోపం (స్టంటింగ్) అంటారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన పోషన్ ట్రాకర్- 2025 జూన్ ఆధారిత డేటా ప్రకారం.. కొన్ని జిల్లాల్లో అత్యధిక సంఖ్య చిన్నారుల్లో ఎదుగుదల లోపం ఉంది.