Share News

Bihar Voter List SIR Protest: ప్రతిపక్షాల నిరసనల హోరు

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:21 AM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రెండో రోజు, మంగళవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం కొనసాగింది

Bihar Voter List SIR Protest: ప్రతిపక్షాల నిరసనల హోరు
Bihar Voter List SIR Protest

  • పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం

  • బిహార్‌ ఓటరు జాబితా సవరణపై చర్చకు పట్టు

న్యూఢిల్లీ, జూలై 22 : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రెండో రోజు, మంగళవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం కొనసాగింది. ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్‌)పై చర్చకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు చేసిన నిరసనలతో ఉభయసభలు హోరెత్తిపోయాయి. దీంతో పలుమార్లు వాయిదాలు పడిన ఉభయసభలు ఎలాంటి చర్చలు లేకుండానే బుధవారానికి వాయిదా పడ్డాయి. ఎస్‌ఐఆర్‌, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. కాగా, ప్రతిపక్ష సభ్యులు ధ్వంధ్వ వైఖరి అనుసరిస్తున్నారని, వారి డిమాండ్‌కు అనుగుణంగా చర్చ నిర్వహిస్తామని చెప్పినా సహకరించడం లేదని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు అసహనం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభ కూడా ఎస్‌ఐఆర్‌ అంశంపై ప్రతిపక్షాల నిరసనలతో పలుమార్లు వాయిదా పడింది. కాగా, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ మకర్‌ ద్వారం వద్ద ఆందోళన చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:21 AM