Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:39 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్ ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. సభలో విపక్షాలు ప్రస్తావించదలచిన అంశాలపై తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదని విమర్శించారు రాహుల్ గాంధీ. కేంద్రమంత్రులను మాట్లాడేందుకు అనుమతిస్తూ విపక్షనేతగా ఉన్న తనను అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.
'ప్రశ్న ఏంటంటే- సభలో రక్షణ మంత్రిని మాట్లాడేందుకు అనుమతించారు. కానీ విపక్ష నాయకుడిగా ఉన్న నాతో సహా ప్రతిపక్ష సభ్యులను అనుమతించలేదు. ఇదో కొత్త తరహా విధానం. ప్రభుత్వం వైపు ఉన్న వాళ్లను మాట్లాడేందుకు అనుమతించినప్పుడు మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడమే సంప్రదాయం' అని రాహుల్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్‌పై చర్చించేందుకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావిస్తూ.. వాళ్లు చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విపక్ష నేతను కూడా మాట్లాడనీయాలని, ఆయన మాట్లాడేందుకు లేచినప్పుడు అనుతించాల్సి ఉంటుందని అన్నారు.
దీనికి ముందు సభలో విపక్ష సభ్యుల ఆందోళన మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కిరణ్ రిజిజు మరింత వివరణ ఇస్తూ, మధ్యాహ్నం 2.30 గంటలకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఉందని, ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంటే వాళ్లు (విపక్ష ఎంపీలు) సభలో నిరసన తెలుపుతున్నారని, సమావేశాల తొలిరోజే ఇలా చేయడం సరికాదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
రన్‌వే దాటిన ఎయిర్ ఇండియా విమానం.. ఏం జరిగిందంటే?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి