Operation Sindoor Title: ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్లో వార్.. ఏకంగా 15 స్టూడియోలు..
ABN , Publish Date - May 09 , 2025 | 09:36 AM
Indian Army: యావత్ దేశమంతా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ చేస్తున్న వార్ గురించి డిస్కస్ చేస్తున్నారు. దాయాదిపై మన సైనికులు విజృంభిస్తున్న తీరు గురించి చర్చించుకుంటున్నారు. యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపించడంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా సహిస్తూ వస్తున్నా.. ఉగ్రవాదాన్ని ఆపకుండా, ఇంకా మనపైకి ఉసిగొల్పుతూ వస్తున్న పాకిస్థాన్ పీచ అణచుతోంది భారత్. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశంతో పాటు అక్కడి టెర్రరిస్టులపై విరుచుకుపడుతోంది భారత సైనిక దళం. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై అటాక్ చేస్తూ ఇండియా పేరు చెబితే వణికిపోయేలా చేస్తోంది. పాక్‌కు గుండెకాయ లాంటి లాహోర్, సియాల్కోట్ వంటి నగరాల్లో దాడులు చేస్తూ వాళ్లకు భయాన్ని పరిచయం చేస్తోంది. ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో బాలీవుడ్ అంతా ఆపరేషన్ సిందూర్‌పై ఫోకస్ చేస్తోంది. ఆ టైటిల్ కోసం బిగ్ వార్ జరుగుతోంది. ఏకంగా 15 స్టూడియోల మధ్య యుద్ధం జరుగుతుండటం ఆశ్చర్యకరంగా మారింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
బడా స్టూడియోల పోటీ..
ఆపరేషన్ సిందూర్ అనే పదం ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది. దేశమంతా అందరి నోళ్లలో ఇది నానుతోంది. దీంతో ఈ టైటిల్‌ను దక్కించుకునేందుకు బాలీవుడ్ మేకర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆర్మీ నేపథ్యంలో చిత్రాలు ఎక్కువగా తీసే నార్త్ మేకర్స్.. ఆపరేషన్ సిందూర్ ఇతివృత్తంతో ఫిల్మ్ రూపొందిస్తే అదిరిపోతుందని భావిస్తున్నారు. దేశభక్తి, మిలటరీ ఆపరేషన్‌ను హైలైట్ చేస్తూ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగానే టైటిల్ ఫైట్ స్టార్ట్ అయిందని సమాచారం. స్టార్ ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ సహా ఏకంగా 15 బాలీవుడ్ స్టూడియోలు ఆపరేషన్ సిందూర్ టైటిల్‌ను రిజిస్టర్ చేసేందుకు పోటీపడుతున్నాయని తెలుస్తోంది. ఇందులో టీ సిరీస్, జీ స్టూడియో లాంటి పాపులర్ కంపెనీలు కూడా ఉన్నాయని సమాచారం. అయితే 15 దరఖాస్తులను పరిశీలించిన తర్వాత త్వరలోనే ఈ టైటిల్‌ను ఒకరికి కేటాయించనున్నారట. దీంతో ఎవరీ టైటిల్‌ను దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ టైటిల్‌తో ఎవరు సినిమా తీసినా అదిరిపోతుందని అంటున్నారు నెటిజన్స్.
ఇవీ చదవండి:
భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..
పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్
వణికిపోతున్న పాక్.. అజ్ఞాతంలో ప్రధాని..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి