Share News

Operation Sindoor: బ్రహ్మోస్ సత్తా ఏమిటో పాక్‌ను అడగండి: యోగి

ABN , Publish Date - May 11 , 2025 | 04:25 PM

ఉగ్రవాదం కుక్కతోక లాంటిదని, దాన్ని సరిచేయాలంటే శాంతి వచనాలు పనిచేయవని, వారి సొంత భాషలోనే సమాధానం ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అదే బాటలో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చిందని చెప్పారు.

Operation Sindoor: బ్రహ్మోస్ సత్తా ఏమిటో పాక్‌ను అడగండి: యోగి

లక్నో: ఆపరేషన్ సిందూర్ (Opeation Sindoor)లో భారత్ ఉపయోగించిన బహ్మోస్ క్షిపణుల సత్తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రశంసించారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం నాడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో బ్రహ్మోస్ పవర్ ఎంటో చాలా స్పష్టంగా అందరికీ తెలిసిందని, ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే పాకిస్తాన్ వెళ్లి అక్కడ ప్రజలను అడిగి తెలుసుకోవాలని చమత్కరించారు.

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్


''ఉగ్రవాదానికి సంబంధించిన ఎలాంటి చర్యనైనా యుద్ధ చర్యగా భావిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టిస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సమయం వచ్చింది. ప్రధానమంతి నాయకత్వాన్ని, ఉగ్రవాద నిర్మూలనా సందేశాన్ని చాటి చెప్పేందుకు యావద్దేశం, ఉత్తరప్రదేశ్ ఏకతాటిపై నిలవాలి'' అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.


ఉగ్రవాదం కుక్కతోక లాంటిదని, దాన్ని సరిచేయాలంటే శాంతి వచనాలు పనిచేయవని, వారి సొంత భాషలోనే సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. అదే బాటలో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చిందని చెప్పారు.


బ్రహ్మోస్ క్షిపణి తయారీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని ఇచ్చిందని, ఇప్పుడు క్షిపణుల తయారీ లక్నోలోనే ప్రారంభమవుతుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రూ.300 కోట్లతో ఈ యూనిట్ నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు 290 నుంచి 400 కిలోమీటర్లను లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇండియా, రష్యా జాయింట్ వెంచర్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ సూపర్‌సోనిక్ క్షిపణలను భూమిపైన, గాలిలోనూ, సముద్రంలోనూ ప్రయోగించవచ్చు.


ఇవి కూడా చదవండి:

బయటపడిన పాక్ పాపాలు

కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 04:54 PM