Share News

Chennai: రూ.4.98 లక్షలకు ఊటీ కొండ రైలు అద్దెకు..

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:51 AM

ఊటీ కొండరైలును అధికారులు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు అద్దెకివ్వడం ద్వారా సంస్థకు ఆర్ధికంగా లాభం కూడా చేకూరుతోంది. ఓ పాఠశాల విద్యార్థులకు రూ.4.98 లక్షలతో కొండ రైలును అద్దెకిచ్చారు.

Chennai: రూ.4.98 లక్షలకు ఊటీ కొండ రైలు అద్దెకు..

చెన్నై: నీలగిరి జిల్లా ఊటీ(Ooty)కి వచ్చే ప్రయాణికులు కొండ రైలు(Hill Train)లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాగే, కున్నూరు-ఊటీ, మేట్టుపాళయం మధ్య నడుపుతున్న కొండ రైలును విదేశీ పర్యాటకులు అద్దెకు తీసుకుని ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో, కోవైలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించింది.

ఈ వార్తను కూడా చదవండి: Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..


nani1.jpg

ఈ పోటీల్లో సుమారు 90 మంది విద్యార్థినీ, విద్యార్థులు గెలుపొందారు. వారికి బహుమతిగా కొండ రైలులో ప్రయాణం చేయించారు. అందుకోసం ఆ సంస్థ నిర్వాహకులు రూ.4.98 లక్షలతో కొండ రైలు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రయాణంతో విద్యార్థులు ఆనందోత్సహాల్లో మునిగిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 11:51 AM