Share News

Amit Shah: పీవోకేను ఇచ్చింది మీరే

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:34 AM

పీవోకేను మీరే ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే దాన్ని తిరిగి తీసుకొస్తుంది అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టం

Amit Shah: పీవోకేను ఇచ్చింది మీరే

  • దానిని బీజేపీ ప్రభుత్వమే తిరిగి తీసుకొస్తుంది

  • కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ, జూలై 30: ‘పీవోకేను మీరే ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే దాన్ని తిరిగి తీసుకొస్తుంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఆయన సవాల్‌ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ‘‘ఎవరో కోరారని ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపేయలేదు. పాకిస్థాన్‌ మన ముందు మోకరిల్లింది. దయచేసి ఇంతటితో ఆపేయండి... అని వారి డీజీఎంవో మనకు ఫోన్‌ చేసి అభ్యర్థించారు. పాక్‌ మన దేశంలోని పౌరులు నివసించే ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. కానీ భారత్‌ మాత్రం వారి 11 ఈ సభ ద్వారా ఉగ్రవాదులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. జమ్మూ కశ్మీర్‌ ఉగ్రవాదం నుంచి విముక్తి పొందుతుంది. ఇది ప్రధాని మోదీ సంకల్పం’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు.

Updated Date - Jul 31 , 2025 | 03:35 AM