Share News

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్.. పెరిగిన ఉల్లి ధర.. కిలో ఎంతంటే..

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:50 AM

స్థానిక కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)లో చిన్న ఉల్లి (సాంబార్‌ ఉల్లిపాయలు) ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మార్కెట్‌లోనే కేజీ ఉల్లిపాయల ధర రూ.100గా పలుకుతోంది.

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్.. పెరిగిన ఉల్లి ధర.. కిలో ఎంతంటే..

- తగ్గిన చిన్న ఉల్లి దిగుబడి.. పెరిగిన ధరలు

చెన్నై: స్థానిక కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)లో చిన్న ఉల్లి (సాంబార్‌ ఉల్లిపాయలు) ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మార్కెట్‌లోనే కేజీ ఉల్లిపాయల ధర రూ.100గా పలుకుతోంది. సాధారణంగా ఈ మార్కెట్‌కు పెరంబలూరు, రాశీపురం, కోయంబత్తూరు, సేలం, తెన్‌కాశితో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక(Karnataka) నుంచి కూడా ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయలు వస్తుంటాయి.


nani4.2.gif

అయితే, దక్షిణాది జిల్లాలతో పాటు కర్ణాటకలో కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ రకం ఉల్లిపాయల దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో కేజీ ఉల్లిపాయలు ధర హోల్‌ సేల్‌లో రూ.50 నుంచి రూ.70 పలుకుతుండగా, చిల్లరగా రూ.100 వరకు విక్రయిస్తున్నారు. నాసిక్‌ రకం పెద్ద ఉల్లిపాయలు కేజీ రూ.20 ధర పలుకుతుండగా, చిల్లరగా రూ.30కు వరకు పలుకుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 11:50 AM