Share News

Amit Shah: హురియత్‌తో మరో వేర్పాటువాద గ్రూపు తెగతెంపులు.. ఇది మోదీ విజయమన్న అమిత్‌షా

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:44 PM

మోదీ నాయకత్వంలో ఐక్యతా స్ఫూర్తి జమ్మూకశ్మీర్‌లో పరిఢవిల్లుతోందని అమిత్‌షా అన్నారు. హురియత్ మరో అనుబంధ సంస్థ జమ్మూకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ సైతం వేర్పాటువాదాన్ని ఖండించిందని, ఐక్య భారత్‌కు కట్టుబడి ఉంటామని ప్రకటించిందని తెలిపారు.

Amit Shah: హురియత్‌తో మరో వేర్పాటువాద గ్రూపు తెగతెంపులు.. ఇది మోదీ విజయమన్న అమిత్‌షా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని తిరస్కరిస్తూ హరియత్ కాన్ఫరెన్స్‌ (Huriyat Confernce)తో మరో గ్రూపు తెగతెంపులు చేసుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' విజన్‌ను ప్రశంసించారు.

Tahwwur Rana: ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్


''మోదీ నాయకత్వంలో ఐక్యతా స్ఫూర్తి జమ్మూకశ్మీర్‌లో పరిఢవిల్లుతోంది. హురియత్ మరో అనుబంధ సంస్థ జమ్మూకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ సైతం వేర్పాటువాదాన్ని ఖండించింది. ఐక్య భారత్‌కు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. హృదయపూర్వకంగా వారి నిర్ణయాన్ని స్వాగతిస్తు్న్నాను. దీంతో ఇంతవరకూ వేర్పాటువాదానికి దూరంగా జరుగుతూ, భారత రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన హురియుత్‌ అనుబంధ సంస్థల సంఖ్య 12కు చేరింది" అని అమిత్‌షా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.


వేర్పాటువాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వంపై అవిశ్రాంతంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో హురియత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఏప్రిల్ 8న హురియత్‌ కాన్ఫరెన్స్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, జమ్మూ అండ్ కశ్మీర్ ముస్లిం డెమోక్రటిక్ లీగ్, కశ్మీర్ ఫ్రీడం ఫ్రంట్‌లు ప్రకటించాయి. దీనిపై అమిత్‌షా వెంటనే ట్వీట్ చేస్తూ, మరో మూడు సంస్థలు హరియత్‌కు దూరంగా జరిగాయని, జమ్మూకశ్మీర్‌లో భారత రాజ్యాంగంపై ప్రజలు బలంగా తమ నమ్మకాన్ని చాటుకున్నాయని చెప్పారు. దీంతో వేర్పాటువాదనికి వ్యతిరేకంగా హురియత్‌తో సంబంధాలు తెంచుకున్న గ్రూపుల సంఖ్య 11కు చేరిందని ప్రకటించారు. శక్తివంతమైన, సమైక్య భారత్‌ కోసం కృషిచేస్తున్న మోదీ విజన్‌‌కు ఇది మరింత బలం చేకూర్చిందని తెలిపారు.


కాగా, దీనికి ముందు మార్చి 25న జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జేకేపీఎం), జమ్మూ అండ్ కశ్మీర్ డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ (జేకేడీపీఎం)లు వేర్పాటువాదాన్ని వీడుతున్నట్టు ప్రకటించాయి. ఆ తర్వాత రెండ్రోజులకు తెహ్రిక్-ఇ-ఇస్తెఖ్‌లాల్, తెహ్రిక్-ఇ-ఇస్తిఖ్ గ్రూపులు హురియత్‌తో తెగతెంపులు చేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా నైనార్ నాగేంద్రన్

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

Custody: తహవ్వుర్‌ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Updated Date - Apr 11 , 2025 | 05:50 PM