Caste Census Move: మోదీ ప్రభుత్వ ప్రకటన.. కాంగ్రెస్ సంబరాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 06:41 PM
మోదీ ప్రభుత్వం కుల గణన చేస్తామంటూ ప్రకటించడం తమ విజయమేనని దేశంలోని విపక్షాలు సంబరపడుతున్నాయి. ఇది ప్రతిపక్షాల అతి పెద్ద విజయంగా సదరు పార్టీలు అభివర్ణిస్తున్నాయి.

Caste Census Move Reactions: మోదీ ప్రభుత్వం కుల గణన చేస్తామంటూ ప్రకటించడం తమ విజయమేనని దేశంలోని విపక్షాలు సంబరపడుతున్నాయి. ఇది ప్రతిపక్షాల అతి పెద్ద విజయంగా సదరు పార్టీలు అభివర్ణిస్తున్నాయి. బీహార్‌లో ఇండియా కూటమి నేతలు లాలూ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్) కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తదుపరి జనాభా గణనలో కుల గణాంకాలను చేర్చాలనే కేంద్రం తీసుకున్న నిర్ణయం తమ ఘనత అని ఆయన అన్నారు.
"30 ఏళ్ల క్రితం సోషలిస్టులమైన మేము ఏమి అనుకుంటున్నామో - రిజర్వేషన్లు, కుల గణన, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం మొదలైనవి.. ఇతరులు దశాబ్దాల తర్వాత అనుసరిస్తారు" అని లాలూ యాదవ్ చెప్పుకొచ్చారు. "ఇది మాకు పెద్ద విజయం. ప్రధాని నరేంద్ర మోదీ కుల గణనను వ్యతిరేకించారు. కానీ కేంద్రం ఇప్పుడు మా ఎజెండాపై పని చేస్తోంది" అని ఆ పార్టీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
కుల సర్వే కాంగ్రెస్ పార్టీ కీలక డిమాండ్.. "కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్. మా నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై ఎంతో కాలంగా పోరాడుతున్నారు" అని కాంగ్రెస్ నేత విజయ్ వాడేట్టివార్ అన్నారు.
Also Read:
Supreme Court: ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు
Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..
Vastu Tips For Washing Machine: వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో ఉంచాలి..