Share News

Omar Abdullah: అలా చేస్తే అసెంబ్లీ రద్దుకు రెడీ

ABN , Publish Date - Jun 24 , 2025 | 08:49 PM

రాష్ట్ర హోదా అనేది ఎమ్మెల్యేకో, ప్రభుత్వానికో చెందినది కాదని, జమ్మూకశ్మీర్ ప్రజలకు సంబంధించిన అంశమని, ఇందుకు తమ ఎమ్మెల్యేలు అడ్డుకాదని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

Omar Abdullah:  అలా చేస్తే అసెంబ్లీ రద్దుకు రెడీ
Omar Abdullah

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా (Statehood) పునరుద్ధరిస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలు జరిపేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) చెప్పారు. రాష్ట్ర హోదా జమ్మూకశ్మీర్ ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం చేశారు.


'రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తారు...కానీ అసెంబ్లీకి ఎన్నికలు మళ్లీ ఫ్రెష్‌గా జరుపుతారు..అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలు చదివాను. అలాగే కానీయండి, ఎవరు కాదన్నారు?' అని గుల్మార్గ్‌లో మీడియాతో మంగళవారంనాడు మాట్లాడుతూ ఒమర్ చెప్పారు. ఈ కథనం ఎక్కడ నుంచి వచ్చిందో, ఇక్కడి న్యూస్‌పేపర్‌లో దీనిని తెచ్చిందెవరో తనకు తెలుసుననీ, ఎమ్మెల్యేలను భయపెట్టేందుకు ఇలాంటివి సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్ర హోదా అనేది ఎమ్మెల్యేకో, ప్రభుత్వానికో చెందినది కాదని, జమ్మూకశ్మీర్ ప్రజలకు సంబంధించిన అంశమని, ఇందుకు తమ ఎమ్మెల్యేలు అడ్డుకాదని చెప్పారు.


రాష్ట్ర హోదా కోసం అసెంబ్లీని రద్దు చేస్తామంటూ ఎమ్మెల్యేలను భయపెట్టదలచుకుంటే అలాగే చేసుకోవచ్చని ఒమర్ అన్నారు. రాష్ట్ర హోదా ఇచ్చిన రోజు తాము స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లి అసెంబ్లీని రద్దు చేయమని సిఫారసు చేస్తామని చెప్పారు. 'ఎమ్మెల్యేలను బెదిరించడం ఎంతమాత్రం సరికాదు. రాష్ట్ర హోదా మా హక్కు. మాది మాకు ఇవ్వండి. వార్తా పత్రికలో ఇలాంటి కథనాల సృష్టి ఆపండి. ఇలాంటివి చెల్లుబాటు కావు'' అని ఒమర్ ఘాటుగా వ్యాఖ్యానించారు


మా వాళ్లను వేధిస్తున్నారు.. పీఎం దృష్టికి తీసుకువెళ్తా

మహారాష్ట్ర ఎన్నికల ఆరోపణలపై ఈసీ నుంచి రాహుల్‌కు పిలుపు

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 08:53 PM