Share News

Madra High Court: పాస్‌పోర్ట్ దరఖాస్తుకు భర్త అనుమతి తప్పనిసరి కాదు

ABN , Publish Date - Jun 20 , 2025 | 09:01 PM

పిటిషనర్ వివరాల ప్రకారం, 2023లో ఆమెకు వివాహం అయింది. అయితే భార్యాభర్తల మధ్య వైహిహిక సమస్యలు ఏర్పడ్డాయి. తమ వివాహం రద్దు చేయాలని కోరుతూ ఆమె భర్త స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.

Madra High Court: పాస్‌పోర్ట్ దరఖాస్తుకు భర్త అనుమతి తప్పనిసరి కాదు

చెన్నై: పాస్‌పోర్టు కోసం ఒక మహిళ దరఖాస్తు చేసుకోవాలంటే భర్త అనుమతి, సంతకం తీసుకోవడం తప్పనిసరి కాదని మద్రాసు హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు ఇచ్చింది. రేవతి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేషన్ విచారణ జరిపిన అనంతరం తాజా తీర్పునిచ్చారు. తన భర్త సంతకం కావాలని పట్టుపట్టకుండా నిర్దిష్ట గడువులోగా పాస్‌పోర్ట్ జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని ఆ మహిళ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.


పిటిషనర్ వివరాల ప్రకారం, 2023లో ఆమెకు వివాహం అయింది. అయితే భార్యాభర్తల మధ్య వైవాహిక సమస్యలు ఏర్పడ్డాయి. తమ వివాహం రద్దు చేయాలని కోరుతూ ఆమె భర్త స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కాగా, పాస్‌పోర్ట్ కోసం పిటిషనర్ గత ఏప్రిల్‌లో రీజనల్ పాస్‌పోర్ట్ అధికారిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫారం-జేలో భర్త సంతకం కావాలని, ఆ తర్వాతనే ప్రోసెస్ ఉంటుందని ఆర్‌పీఏ నుంచి ఆమెకు సమాచారం అందింది. దీంతో ఆమె మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.


దీనిపై జస్టిస్ ఆనంద్ వెంకటేష్ తాజా ఆదేశాలు ఇస్తూ, ఇండిపెండెంట్‌గానే ఆమె పిటిషన్‌ను ప్రోసెస్ చేయాలని ఆర్‌పీఓను ఆదేశించారు. సమాజంలో మహిళల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆర్‌పీఓ సమాధానం అద్దంపడుతోందని తప్పుపట్టరు. పాస్‌పోర్ట్ ప్రోసెసింగ్ ప్రక్రియలో భర్త అనుమతి, సంతకం అవసరమని పాస్‌పార్ట్ కార్యాలయం పట్టుబట్టడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అన్నారు. ఇప్పటికే పిటిషనర్, ఆమె భర్త మధ్య మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో భర్త నుంచి ఆమె సంతకం ఎలా తెస్తుందని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. వివాహం అయినంత మాత్రాన పిటిషనర్ తన వ్యక్తిత్వం కోల్పోనవసరం లేదని, భర్త అనుమతి లేకుండా ఆమె ఎప్పుడైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, మహిళలు ముందుకు వెళ్తుంటే పురుషాధిక్యత ప్రదర్శించడం సమర్ధనీయం కాదన్నారు. పిటిషనర్ పాస్‌పోర్ట్‌‌ దరఖాస్తును వెంటనే ప్రాసెస్ చేయాలని, నాలుగు వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆమె పేరుపై పాస్‌పోర్ట్ జారీ చేయాలని ఆర్‌పీఓను జడ్జి ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా

వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 09:12 PM