Mallikarjun Kharge: మేము భయపడం.. ఈడీ చార్జిషీటులో సోనియా, రాహుల్ పేర్లపై ఖర్గే
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:36 PM
వక్ఫ్ అంశంపై కేంద్రం. బీజేజీ నేతలు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, వారి కుట్రలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి బహిర్గతం చేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. వక్ఫ్ అంశంపై కాంగ్రెస్, విపక్ష పార్టీలు లేవనెత్తిన కీలకమైన పాయింట్లకు సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో నెంబర్ 1, నెంబర్ 2 నిందితులుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ భయపడిపోదని అన్నారు.
Nishikant Dubey: చట్టాలు వాళ్లే చేస్తే పార్లమెంటు మూసేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
''మేమేమీ బెదిరిపోవడం లేదు. కేవల ప్రతీకారంతోనే నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేసి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీటు నమోదు చేసింది'' అని పార్టీ ప్రధాన కార్యదర్శులతో శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే అన్నారు. ఈడీ చర్య యాదృచ్ఛికంగా జరిగినది కాదని, అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశం నిర్వహించిన వెంటనే ఈ చర్యలకు దిగిందని అన్నారు.
బీజేపీ కుట్రను బహిర్గతం చేస్తాం
వక్ఫ్ అంశంపై కేంద్రం. బీజేజీ నేతలు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, వారి కుట్రలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి బహిర్గతం చేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. వక్ఫ్ అంశంపై కాంగ్రెస్, విపక్ష పార్టీలు లేవనెత్తిన కీలకమైన పాయింట్లకు సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైకి తెచ్చిందని, ఆల్ ఇండియా బ్లాక్ భాగస్వాములు కూడా మనకు మద్దతుగా నిలిచారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..